సూపర్‌ సింగర్‌ జూనియర్‌ గ్రాండ్‌ ఫైనల్‌.. గెస్టులు ఎవరో తెలుసా?

26 Aug, 2022 19:13 IST|Sakshi

గాత్రం మీది... వేదిక మాది... వయసుతో పనేముంది? ప్రతిభే కదా ఉండాల్సింది! వందమందిలో అయినా ఆత్మవిశ్వాసంతో పాడగలననే ధైర్యం.. శాస్త్రీయమైనా, సమకాలీనమైనా శృతి తప్పకుండా వినపించనగలననే నమ్మకం... వెరసి,  మీరే సూపర్‌ సింగర్‌!!

ఔత్సాహిక గాయనీగాయకులకు అపూర్వ అవకాశమందిస్తున్న స్టార్‌మా సూపర్‌ సింగర్‌ జూనియర్‌ పోటీలు ముగింపు దశకు వచ్చాయి. గత 13 వారాలుగా బుల్లితెర ప్రేక్షకులను తమ అపూర్వ గాన ప్రతిభతో కట్టిపడేసిన బుల్లి గాయనీగాయకులు ఇప్పుడు టైటిల్‌ పోరుకు సిద్ధమయ్యారు. తెలుగు టెలివిజన్‌ రంగ చరిత్రలో ఎంతోమంది సూపర్‌ సింగర్స్‌ను వెలుగులోకి తీసుకువచ్చిన స్టార్‌ మా సూపర్‌ సింగర్‌ జూనియర్‌ పోటీల ఫైనల్స్‌ను ఈ ఆదివారం (ఆగస్టు 28) మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించబోతున్నారు.

పదమూడు వారాలు... 14 మంది అపూర్వ గాయనీ గాయకులతో రసవత్తరంగా జరిగిన పోటీల ఫైనల్స్‌లో ఐదుగురు పోటీపడబోతున్నారు. ఈ ఎపిసోడ్‌కు ముఖ్య అతిథులుగా అక్కినేని నాగార్జున, బ్రహ్మానందంతో పాటు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రబృందం కృతీశెట్టి, సుధీర్‌ బాబు, ఇంద్రగంటి మోషన కృష్ణ విచ్చేయనున్నారు. హాట్‌స్టార్‌లోనూ ప్రసారం కాబోయే ఫైనల్స్‌కు గాయకులు చిత్ర, మనో, హేమచంద్ర, రనీనా రెడ్డి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. అనసూయ, సుధీర్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

చదవండి: వేరే అమ్మాయితో నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌, గుండె పగిలింది: సింగర్‌
నెట్టింట వైరల్‌ అవుతున్న ‘అర్జున్‌రెడ్డి’ డిలీటెడ్‌ సీన్‌

మరిన్ని వార్తలు