తాప్సీ ధరించిన ఈ చీర ఖరీదు ఎంతో తెలుసా?

18 Jul, 2021 12:29 IST|Sakshi

స్టార్‌ స్టయిల్‌

తాప్సీ పన్ను.. టాలెంటెడ్‌ బ్యూటీ.  నటనలోనే కాదు ఫ్యాషన్‌లోనూ వెర్సటాలిటీ ఆమె స్పెషాలిటీ. దాన్ని ఆమె స్టయిల్‌ సిగ్నేచర్‌గా మార్చిన బ్రాండ్స్‌ ఇవి... 

బ్రాండ్‌ వాల్యూ 
ఆప్రో : వత్సల కొఠారి, అర్హత కొఠారి, భవిత కొఠారి.. అక్కాచెల్లెళ్లు. ఈ ముగ్గురూ కలసి 2015లో జైపూర్‌లో ‘ఆప్రో’ అనే సంస్థను స్థాపించారు. ప్రతి కస్టమర్‌కు నచ్చే విధంగా ట్రెడిషనల్, ట్రెండీ, ఫ్యాషనబుల్‌ డిజైన్స్‌ను అందించడం వీరి ప్రత్యేకత. ఎక్కువగా సంప్రదాయ చేనేత కళకు ప్రాధాన్యం ఇస్తారు. తాజాగా  గృహాలంకరణ వస్తువుల కోసం ‘ఆప్రో ఘర్‌’ పేరుతో మరో సంస్థనూ ప్రారంభించారు.  ఇందులో అందమైన కుషన్స్, కర్టెన్స్, బెడ్‌షీట్స్‌ వంటి ఇతర వస్తువులూ ఉన్నాయి. తతిమా బ్రాండ్స్‌తో పోలిస్తే ఈ బ్రాండ్‌ డిజైన్స్‌ సరసమైన ధరల్లోనే దొరుకుతాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. 

చీర బ్రాండ్‌: ఆప్రో
ధర: రూ. 15,500
నా స్టైల్‌ డబుల్‌ సీ డబుల్‌ సీ. అంటే.. కాంటెంపరరీ, కాన్ఫిడెన్స్, క్లాసీ, కంఫర్టబుల్‌ డిజైన్స్‌. వీటినే ఎక్కువగా ఇష్టపడతాను. అది ధరించే దుస్తుల్లో అయినా, పోషించే పాత్రల్లో అయినా..– తాప్సీ పన్ను

ఇయర్‌రింగ్స్‌ బ్రాండ్‌: రియా
ధర: రూ. 5,290

కుటుంబ నేపథ్యం వజ్రాల వ్యాపారం కావడంతో రియాకు చిన్నప్పటి నుంచి ఆభరణాలపై మక్కువ ఎక్కువ. ఆ ఇష్టంతోనే  జ్యూయెలరీ డిజైనర్‌గా మారింది. బంగారం, వెండి, వజ్రాలతోనే కాకుండా ప్లాస్టిక్‌ నుంచి ఫ్యాబ్రిక్‌ వరకు ప్రతి పదార్థాన్నీ ఆమె డిజైన్స్‌ కోసం ఉపయోగిస్తుంది. అదే ఆమె యూఎస్‌పీ.  ఆరుసంవత్సరాల కిందట సొంతంగా ‘రియా’ పేరుతో బ్రాండ్‌ను క్రియేట్‌ చేసింది. కొద్దికాలంలోనే ఆమె పాపులరై ప్రముఖ జ్యూయెలరీ డిజైనర్స్‌లో ఒకరిగా నిలిచింది. అతి తక్కువ ధరల్లో,  ప్రత్యేకమైన డిజైన్స్‌ ఇక్కడ లభిస్తాయి. యువతలో  ఈ బ్రాండ్‌కు మంచి క్రేజ్‌ ఉంది. ఆన్‌లైన్‌లో రియా జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు.
-దీపిక కొండి

మరిన్ని వార్తలు