'అల్లు' స్టూడియోస్ ప్రారంభం

1 Oct, 2020 14:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నట దిగ్గజంగా పేరొందిన అల్లు రామలింగయ్య 99వ జయంతి నేడు. ఈ సందర్భంగా అల్లు కుటుంబ సభ్యులు గురువారం ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని  హైదరాబాద్‌లో ఆయన కుటుంబసభ్యులు అల్లు స్టూడియోస్ ప్రారంభించారు. సినిమా, టీవీ చిత్రీకరణలకు ఉపయోగపడేలా ఈ స్టూడియో భారీస్థాయిలో నిర్మాణం జరుపుకోనుంది. ఈ అల్లు స్టూడియో ప్రారంభోత్సవంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, హీరోలు అల్లు అర్జున్, అల్లు శిరీష్, నిర్మాత అల్లు బాబీ పాల్గొన్నారు. తన ముగ్గురు తనయులతో కలిసి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అల్లు అరవింద్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. స్టూడియో ప్రారంభించడంపై అల్లు అరవింద్ త్వరలో ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా