"ఉక్కు సత్యాగ్రహం" ఆడియో విడుదల

25 Nov, 2022 19:56 IST|Sakshi

తాను ఏ తరహా సినిమా తీసినా అందులో సామాజిక అంశాలను మిళితం చేసే సత్యారెడ్డి ఇప్పటివరకు ప్రత్యూష, సర్దార్ చిన్నపరెడ్డి ,రంగుల కళ ,కుర్రకారు ,అయ్యప్ప దీక్ష , గ్లామర్, సిద్ధం, ప్రశ్నిస్తా వంటి చిత్రాలను నిర్మించారు. దర్శక, నిర్మాతగానే కాకుండా నటుడిగా కూడా తన అభిరుచిని చాటుకుంటున్నాడు. జనం సమస్యల పరిష్కారం కోసం రగులుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధాన అంశంగా చేసుకుని “ఉక్కు సత్యాగ్రహం” పేరుతో సత్యారెడ్డి ఓ సినిమా తీస్తున్నారు. తాను ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వీయ నిర్మాణ దర్శకత్వంలో జనం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సత్యారెడ్డి రూపొందిస్తున్నారు.

మొన్నామధ్య గద్దర్‌ రాసిన పాటను రిలీజ్‌ చేయగా తాజాగా సుద్దాల అశోక్ తేజ రచించిన పాటను విడుదల చేశారు. గద్దర్ మాట్లాడుతూ.. 'ఈ సమస్య కేవలం విశాఖపట్నం ప్రజలది మాత్రమే కాదు. మన తెలుగు ప్రజలందరిది. మొత్తం తెలుగు ప్రజలందరూ ఏకమవ్వాలని పిలుపునిస్తున్నాను. అందరూ కలిసి ఈ ప్రయివేటీకరణ ఆపగలరు' అని కోరాడు.

చదవండి: శ్రీసత్య ఎప్పుడు ఎలిమినేట్‌ అవుతుందా అని చూస్తున్న హమీదా
నా కోడలు బంగారం.. నయన్‌ అత్త

మరిన్ని వార్తలు