పెద్ద మనసు చాటుకున్న సుధీర్‌ బాబు

4 Jun, 2021 15:12 IST|Sakshi

తెరపైనే కాదు నిజ జీవితంలో కూడా హీరోననే నిరూపించుకున్నాడు టాలెంటెడ్‌ యాక్టర్‌ సుధీర్‌ బాబు. హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న ఓ చిన్నారికి ఆపరేషన్‌ చేయించి పెద్ద మనసును చాటుకున్నాడు. వివరాల్లోకి వెళ్లితే.. కొన్నాళ్ల క్రితం బేబీ సంస్కృతి కోసం సోషల్‌ మీడియా వేదికగా సుధీర్ బాబు ఒక ఫండ్ రైజర్ నిర్వహించాడు. ట్విటర్‌లో సదరు చిన్నారి హార్ట్ ప్రాబ్లం గురించి చెప్పాడు. ‘ఎమర్జెన్సీ: బేబీ సంస్కృత గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటుంది. ఆమె ఆపరేషన్ ప్రారంభించడానికి నేను 1 లక్షలు అందిస్తున్నా, కానీ ఆమె ఆపరేషన్ కోసం, ఇతర వైద్య ఖర్చుల కోసం 3.5 లక్షలు కావాలి. కాబట్టి నేను వ్యక్తిగతంగా నిధులు సేకరిస్తున్నాను. దయచేసి సహకరించండి’ అంటూ ట్వీట్‌ చేశారు.

సుధీర్‌ బాబు పిలుపుతో చాలా మంది డబ్బును విరాళంగా ఇచ్చారు. దీంతో ఆ చిన్నారి ప్రమాదం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యంగా ఉంది.  చిన్నారి  ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసం బ్యాంకులో కొంత డబ్బుని డిపాజిట్‌ చేస్తానని హామీ ఇచ్చారు సుధీర్‌ బాబు.  పని గుండె కోసం పరితపించిన సుధీర్‌ బాబుపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రియల్‌ హీరో అంటూ కామెంట్లు చేస్తున్నారు. 
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు