ఎప్పుడెప్పుడు రిలీజ్‌ అవుతుందా అనేలా ఉంది‌

21 Apr, 2021 11:01 IST|Sakshi

ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై  ప్రొడ‌క్ష‌న్ నెం.1గా అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ నిర్మాత‌లుగా తెరకెక్కుతున్న సినిమా `పీన‌ట్ డైమండ్`.. అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్  ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటించారు. వెంక‌టేష్ త్రిప‌ర్ణ క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం అందించగా `బెంగాల్ టైగ‌ర్` ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు..

ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా ఆ టీజర్ ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ రిలీజ్ చేయడం విశేషం..  సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ  ఒకేసారి రెండు టైం లైన్స్ లో జరిగే కథగా తెరకెక్కుతుండగా జె. ప్ర‌భాక‌ర రెడ్డి ఛాయాగ్ర‌హ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త్వరలోనే సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.  తాజాగా ఈ చిత్రంలోని పాటను టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో సుధీర్ బాబు రిలీజ్ చేశారు. 

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..  `పీన‌ట్ డైమండ్` సినిమా టైటిల్ చాలా వెరైటీ గా ఉంది.. సినిమా కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నా..టీజర్ చూశాను.. ఎంతో ఆసక్తికరంగా ఉంది.. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనేలా ఉంది..  నేను రిలీజ్ చేసిన పాట ఎంతో వినసొంపుగా ఉంది.. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి.. ఈ పాట కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు