అందుకే ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ఆఫర్‌ వదులుకున్నా: సుధీర్‌ బాబు

16 Sep, 2022 20:12 IST|Sakshi

హీరో సుధీర్‌ బాబు తాజా చిత్రం ‘ఆ అ‍మ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు (సెప్టెంబర్‌ 16న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. ఇక మూవీ ప్రమోషన్లో భాగంగా రీసెంట్‌గా ఓ చానల్‌తో ముచ్చటించిన సుధీర్‌ బాబు ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. 

చదవండి: ఈ ఒక్కరోజే ఓటీటీలోకి 20 సినిమాలు, ఎక్కడెక్కడంటే..

ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన పాన్‌ ఇండియా చిత్రం ‘బ్రహ్మాస్త్ర’లో నటించే అవకాశం వచ్చిందని, అయితే ఆ ఆఫర్‌ వదులుకున్నానంటూ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా మూవీ విశేషాల గురించి చెబుతూ ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఆ వెంటనే బ్రహ్మాస్త్ర మూవీ ఆఫర్‌ వదులుకోవడానికి కారణమేంటి? అని యాంకర్‌ ప్రశ్నించగా సుధీర్‌ బాబు ఇలా స్పందించాడు. ‘అవును నాకు బ్రహ్మాస్త్ర మూవీ ఆఫర్‌ వచ్చింది. అయితే అప్పటికే నేను తెలుగులో పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాను. అందుకే బ్రహ్మాస్త్రలో చేయలేని చెప్పాను. అదే కారణం అంతకు మించి ఏం లేదు’ అని అన్నాడు.

చదవండి: గొప్ప మనసు చాటుకున్న రావు రమేశ్‌.. అతడి కుటుంబానికి రూ.10 లక్షల సాయం

కాగా సుధీర్‌ బాబు గతంలో టైగర్‌ ష్రాఫ్‌ నటించిన భాగీ చిత్రంలో విలన్‌గా నటించి బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ దర్శకత్వలో ఆలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌ తొలిసారిగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. కింగ్‌ నాగార్జున కీలక పాత్రలో నటించిన మూవీ గత సెప్టెంబర్‌ 9న విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా  తొలివారం రూ. 300 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. ఇక దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రం రూ. 200 కోట్లు వసూలు చేసిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు