బ్రాడ్‌ పిట్‌లా ఉండాలన్నారు

3 Sep, 2020 01:36 IST|Sakshi
సుధీర్‌బాబు

నాని, సుధీర్‌బాబు నటించిన మల్టీస్టారర్‌ సినిమా ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు చెప్పిన విశేషాలు

► ‘వి’ సినిమా రాక్షసునికి, రక్షకునికి మధ్య జరిగే పోరాటం. నేను హీరో, నాని విలన్‌. ఇద్దరం కొలతలేసుకుని నటించలేదు, క్యారెక్టర్ల ప్రకారం నడుచుకున్నాం. రెండు పాత్రలకూ సమాన ప్రాధాన్యం ఉంటుంది. నేను ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంటర్‌ అయ్యేటప్పటికే అక్కడ రాక్షసుడు (అప్పటికే నాని ఈ పాత్రకు కన్‌ఫార్మ్‌ అయ్యారు) ఉన్నాడు. అందుకే నేను రక్షకుడు అయ్యాను. ఒకవేళ రెండు పాత్రలు నాకు చెప్పి నన్ను ఎన్నుకోమన్నా నేను పోలీసాఫీసర్‌ పాత్రనే ఎన్నుకునేవాణ్ణి. అంటే... ఇదే బెటర్‌ రోల్‌ అని చెప్పడంలేదు. కానీ నాకు ఇది కొత్త, నానీకి అది కొత్తగా ఉంటుంది.

► ఇంద్రగంటి గారంటే మహేశ్‌గారికి ఫుల్‌ నమ్మకం. ‘సమ్మోహనం’ సమయంలో రాత్రి ఒంటి గంటకు ఫోన్‌ చేసి ఈ సినిమా బావుంటుందని ధైర్యం చెప్పారు. మొన్నీ మధ్య మహేశ్‌గారిని కలిసినప్పుడు కూడా ‘వి’లో యాక్షన్‌ సీక్వెన్స్‌ బాగుంది, యాక్షన్‌ కొరియోగ్రఫీ ఎవరు? అని అడిగారు. ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలని వెయిట్‌ చేస్తున్నారు మహేశ్‌. ఇందగ్రంటిగారు నాకు ఈ కథ చెప్పినప్పుడు ఫైట్స్‌ నేచురల్‌గా ఉండాలనుకుంటున్నాను అని నా బాడీ ఎలా ఉండాలో చెప్పారు. చూడటానికి లావుగా ఉండకూడదు, కానీ చొక్కా విప్పితే కండలు ఉండాలని చెప్పారు. ఉదాహరణకి బ్రాడ్‌ పిట్‌లా ఉండాలన్నారు. అదే నాకు మోటివేషన్‌లా అనిపించింది.

► లాక్‌డౌన్‌లో అందరిలానే ఫ్యామిలీతో టైమ్‌ స్పెండ్‌ చేసే అవకాశం వచ్చింది. చూడాలనుకున్న చాలా సినిమాలు చూసే తీరిక దొరికింది, చూశాను. అలానే చాలా కథలు విన్నాను. అందులో రెండు కథలకి ఓకే చెప్పాను. ఈ డిసెంబర్‌ నుండి పుల్లెల గోపిచంద్‌ బయోపిక్‌లో నటిస్తున్నాను. ఇది ప్యాన్‌ ఇండియా సినిమా. 

మరిన్ని వార్తలు