సుడిగాలి సుధీర్‌ నాలుగో సినిమా షురూ

13 May, 2023 04:06 IST|Sakshi

సుడిగాలి సుధీర్‌ హీరోగా నాలుగో సినిమా ‘ఎస్‌ఎస్‌4’ (వర్కింగ్‌ టైటిల్‌) షురూ అయింది. ‘పాగల్‌’ ఫేమ్‌ నరేష్‌ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దివ్య భారతి హీరోయిన్‌. లక్కీ మీడియా–మహారాజా క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై చంద్రశేఖర్‌ రెడ్డి మొగుళ్ల, బెక్కం వేణుగోపాల్‌ నిర్మిస్తున్నారు.

ఈ   సినిమా పూజా కార్యక్రమానికి నిర్మాతలు డి. సురేశ్‌ బాబు, కేఎస్‌ రామారావు, సూర్యదేవర రాధాకృష్ణ, కేఎల్‌ దామోదర ప్రసాద్‌ అతిథులుగా హాజరయ్యారు. తొలి సీన్‌కి నిర్మాత పి. కిరణ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, మరో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు క్లాప్‌ కొట్టారు. ‘‘మంచి కథాంశంతో రూపొందుతున్న చిత్రం ఇది’’ అన్నారు చంద్రశేఖర్‌ రెడ్డి మొగుళ్ల, బెక్కం వేణుగోపాల్‌. ‘‘ఒక గంట కథ వినగానే ఒప్పుకున్న సుధీర్‌కి థ్యాంక్స్‌’’ అన్నారు నరేష్‌ కుప్పిలి. ఈ చిత్రానికి సంగీతం: లియోన్‌ జేమ్స్, కెమెరా: బాలాజీ సుబ్రహ్మణ్యం. 

మరిన్ని వార్తలు