కలయా.. నిజమా..

9 Jun, 2023 03:39 IST|Sakshi
అరుణ్, కటూరి వెంకటేశ్వర్లు, సుడిగాలి సుధీర్‌

సుడిగాలి సుధీర్‌ హీరోగా రూపొందుతున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘కాలింగ్‌ సహస్ర’. ఈ చిత్రంలో డాలిశ్య హీరోయిన్‌. అరుణ్‌ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్‌ తయాల్, పమిడి చిరంజీవి, కటూరి వెంకటేశ్వర్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘కలయా నిజమా..’పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. మోహిత్‌ రెహమానిక్‌ స్వరపరచిన ఈపాటకు లక్ష్మీ ప్రియాంక సాహిత్యం అందించగా, కేఎస్‌ చిత్రపాడారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సాంగ్‌ లాంచ్‌ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్‌ మాట్లాడుతూ– ‘‘మూడేళ్ల కష్టం ఈ సినిమా.

ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు భిన్నంగా డిఫరెంట్‌ జానర్‌లో రూపొందిన సినిమా ఇది’’ అన్నారు. ‘‘చిత్రగారుపాడిన తర్వాత ఈపాటకు మరింత అందం వచ్చింది. ఈపాట టైమ్‌లో ఆమెకు ఆరోగ్యం సరిగ్గా లేక΄ోయినా నాలుగు గంటలు ప్రాక్టీస్‌ చేసి, మరీపాడారు’’ అన్నారు మోహిత్‌ రెహమానిక్‌. ‘‘నిర్మాతలుగా మాకు ‘కాలింగ్‌ సహస్ర’ తొలి అడుగు. మాకు ఇదొక స్వీట్‌ మెమొరీ’’ అన్నారు వెంకటేశ్వర్లు. ‘‘సినిమా ఎంగేజింగ్‌గా ఉంటుంది’’ అన్నారు శివ బాలాజీ. డాలిశ్య, లక్ష్మీ ప్రియాంక, సినిమాటోగ్రాఫర్‌ సన్నీ, యూ ట్యూబర్‌ రవితేజ తదితరులుపాల్గొన్నారు.

మరిన్ని వార్తలు