తొలిసారి తన ఆస్తులపై స్పందించిన సుడిగాలి సుధీర్‌

25 Aug, 2021 17:55 IST|Sakshi

సుడిగాలి సుధీర్‌.. బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరియయం అక్కర్లేని పేరు ఇది. ఓ కామెడీ షోతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన సుధీర్‌ తనదైన యాంకరింగ్‌, కామెడీ, డ్యాన్స్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అప్పుడప్పుడు తన మాయతో మెజీషియన్‌గా కూడా మెప్పిస్తున్నాడు. పరిశ్రమలో అడుగు పెట్టిన అనతి కాలంలోనే సుధీర్‌ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అలా ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్న సుధీర్‌ వరుసగా అవకాశాలు అందుకుంటూ ఫుల్‌ బిజీ అయిపోయాడు.

చదవండి: తన ఫస్ట్‌లవ్‌ను పరిచయం చేసిన వర్మ

పలు టీవీ షోలు, ఈవెంట్లతో పాపులారిటీ సంపాదించుకున్న అతడు ఇటీవల ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’తో హీరోగా మారాడు. ఇటూ యాంకర్‌గా, కామెడియన్‌గానే కాకుండా అటూ సినిమాల్లోనూ చిన్న పాత్రలు పోషిస్తూ నటుడిగా సుధీర్‌ పుల్‌ బిజీగా మారాడు. ఇలా ఖాళీ సమయమే దొరకనంతగా కష్టపడుతున్న సుధీర్‌ సంపాదన ఎంత ఉంటుందనేది తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ కామెడీ షోలో సుధీర్‌ తన ఆస్తులపై నోరు విప్పాడు. ఇక అతడి ఆస్తుల వివరాలు విని అందరూ నోళ్లు వెళ్లబెడుతున్నారు. కాగా అవకాశాల కోసం హైదరాబాద్‌ వచ్చిన సుధీర్‌ ఆశ్రమం లేక రైల్వే స్టేషన్‌లోనే పడుకునేవాడినని ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో షోలో చెప్పిన సంగతి తెలిసిందే.

                                  కుటుంబంతో సుధీర్‌

చదవండి: మహానటి సావిత్రి చేతిలో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పటి స్టార్‌ హీరో తెలుసా!

అలాంటి పరిస్థితి నుంచి వచ్చిన సుధీర్‌కు ఇప్పుడు హైదరాబాద్‌లో రెండు సొంతిళ్లు ఉన్నాయట. అంతేకాదు పలు స్థిరాస్తులు కూడా బాగానే కూడబెట్టుకుంటున్నానని ఈ షోలో అతడు వెల్లడించాడు. దీంతో సిటీలో ఒక ఇళ్లు కొనడమే కష్టం అలాంటిది సుధీర్‌ రెండు ఇల్లులు కొన్నాడంటే బాగానే సంపాదిస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. అతడి ఎదుగుదల చూసి ఫ్యాన్స్‌ సుధీర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా’ అంటూ పోకిరిలోని మహేశ్‌ డైలాంగ్‌ను సుధీర్‌కు ఆపాదిస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

చదవండి: శ్రీలంక యువతి కేసులో కీలక మలుపు: హీరో ఆర్యకు బిగ్‌ రిలీఫ్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు