నెలకు రూ.లక్ష పైనే, నన్ను పెళ్లి చేసుకుంటావా?

26 May, 2021 07:56 IST|Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌, గౌరీ ఖాన్‌ల ముద్దుల కూతురు సుహానా ఖాన్‌ నిన్న(మే 25న) 21వ వడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా గౌరీ ఖాన్‌ కూతురి ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ప్రత్యేక విషెస్‌ తెలియజేసింది. 'నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం' అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. సుహానా బర్త్‌డే అని తెలియగానే చాలామంది అభిమానులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఓ అభిమాని మాత్రం ఏకంగా పెళ్లి ప్రపోజల్‌ తీసుకురావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

'గౌరీ మేడమ్‌.. నేను నెలకు లక్ష రూపాయలకు పైనే సంపాదిస్తాను. నాకు సుహానాను ఇచ్చి పెళ్లి చేయండి' అంటూ చేతులెత్తి వేడుకుంటున్న ఎమోజీని జత చేశాడు. అయితే అతడి ప్రపోజల్‌ను గౌరీ పట్టించుకుందో లేదో కానీ నెటిజన్లు మాత్రం సెటైర్లు వేస్తున్నారు. నీ లక్ష రూపాయలు వారికి ఏ మూలకూ సరిపోవు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా వుంటే సుహానా ఖాన్‌ న్యూయార్క్‌లో విద్యనభ్యసిస్తోన్న విషయం తెలిసిందే. సెకండ్‌ లాక్‌డౌన్‌ విధించగానే గౌరీ ఖాన్‌ తన కొడుకు ఆర్యన్‌ను తీసుకుని కూతురి దగ్గరకు వెళ్లిపోయింది. అంటే షారుక్‌ మినహా కుటుంబం అంతా న్యూయార్క్‌లోనే సేద తీరుతోంది.

A post shared by Suhana Khan (@suhanakhan2)

చదవండి: ఈ ఫోటోలో ఉన్న స్టార్‌ కిడ్స్‌ని గుర్తుపట్టారా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు