స్టార్ హీరో కూతురు గొప్పమనసు.. అడిగిన వెంటనే ఇచ్చేసింది!

12 Aug, 2023 16:30 IST|Sakshi

బాలీవుడ్ బాద్‌షా, సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కూతురిగా సుహానా ఖాన్ బీటౌన్‌లో సుపరిచితమైన పేరు. బాలీవుడ్‌లో ఇంకా అరంగేట్రం చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్ సెలబ్రీటీల పిల్లలు తరచుగా పార్టీలకు, పబ్‌లకు వెళ్లడం సర్వసాధారణంగా జరిగేదే. అలా వెళ్లేవారిలో అయితే షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కూడా ఒకరు. తాజాగా తన తల్లి గౌరీ ఖాన్‌తో కలిసి ఓ ఈవెంట్‌కు హాజరైన సుహానా కెమెరాల కంటికి చిక్కింది. ఆ ఈవెంట్‌ నుంచి బయటకు వస్తూ కారులో వెళ్తుండగా.. సుహానా ఖాన్‌ను ఓ మహిళ సాయం చేయమని అడిగింది. 

(ఇది చదవండి:  మొన్న ఏజెంట్‌.. ఇప్పుడు భోళా.. పాపం సుంకర!)

దీంతో వెంటనే తన బ్యాగ్‌లోని ఐదువందల రూపాయల నోట్లను ఇచ్చేసింది సుహానా. ఇది చూసిన నెటిజన్స్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బంగారం లాంటి మనసు ఉన్న అమ్మాయి అంటూ కొనియాడారు. కష్టాల్లో ఉన్న మహిళలకు సాయం చేయడాన్ని అభినందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

ముంబయిలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సుహానా తన తల్లితో పాటు హాజరయ్యారు. సుహానా త్వరలోనే జోయా అక్తర్ తెరకెక్కిస్తోన్న ది ఆర్చీస్‌తో ఎంట్రీ ఇస్తోంది. ఈ ఏడాది చివర్లో నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.  అయితే మేకర్స్ ఇంకా ఎలాంటి అధికారిక తేదీని ప్రకటించలేదు. ఆర్చీస్‌లో శ్రీదేవి, బోనీ కపూర్‌ల చిన్న కుమార్తె ఖుషీ కపూర్, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా కూడా నటించారు. 

(ఇది చదవండి: నా జీవితంలో అది ఎప్పటికీ ప్రత్యేకమే: నిహారిక )

A post shared by Viral Bhayani (@viralbhayani)


 

మరిన్ని వార్తలు