Family Drama: ఓటీటీలోకి సుహాస్‌ ‘ఫ్యామిలీ డ్రామా’..ఆసక్తికరంగా ట్రైలర్‌

21 Oct, 2021 22:15 IST|Sakshi

‘కలర్‌ ఫోటో’ఫేమ్‌ సుహాస్‌ హీరోగా నటిస్తున్న తాజాగా చిత్రం ‘ఫ్యామిలీ డ్రామా’.మ్యాంగో మాస్ మీడియా స‌మ‌ర్ప‌ణ‌లో ఛ‌ష్మా ఫిలింస్, నూతన భార‌తి ఫిల్మ్స్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్లతో కలిసి తేజా కాసరపు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెహెర్‌ తేజ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.  క్రైమ్‌ థ్రిల్లర్‌ డ్రామాగా తెరకెక్కుతున్న  ఈ చిత్రం ఈ నెల 29న సోని లివ్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని ను ‘సోని లివ్’ రిలీజ్ చేసింది. 

ప్రతి చిన్న విషయానికి తండ్రి బూతులు తిడుతున్నాడనే కారణంగా ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఓ అబ్బాయి, తన ఇంట్లో పరిస్థితులు నచ్చక బయటకి వచ్చేసిన ఓ అమ్మాయి.. ఈ ఇద్దరూ ఎలా కలిశారు? వీరికి సుహాస్ ఎలా సాయపడ్డాడు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది.  ‘ఈత రానివాడు సముద్రాన్ని తిట్టుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుందో..వినడం రానివాడు సంగీతం గురించి మాట్లాడినా అంతే అసహ్యంగా ఉంటుంది’ అని సుహాస్‌ చెప్పిన డైలాగ్‌ మెప్పిస్తుంది. 

మరిన్ని వార్తలు