ఆమె అంటేనే అసూయ.. ఓర్వలేకపోయేది.. నటిపై సంచలన ఆరోపణలు

22 Jan, 2023 18:58 IST|Sakshi

సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ పేరును కూడా ఈడీ చేర్చింది. అయి తే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేశ్ చంద్రశేఖర్‌ ఈడీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో పలు కీలక విషయాలను వివరించాడు. మరో నటి నోరా ఫతేహిపై సంచలన ఆరోపణలు చేశాడు.

నోరా నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై ఎప్పుడూ అసూయపడేదని సుకేశ్ విచారణలో తెలిపాడు. తాను జాక్వెలిన్‌తో రిలేషన్‌లో ఉండగా.. తనను బ్రెయిన్‌వాష్ చేయడానికి ప్రయత్నించేదని సుకేష్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు. నేను జాక్వెలిన్‌ను విడిచిపెట్టి ఆమెతో డేటింగ్ చేయాలని కోరిందని సుకేశ్ వివరించారు. నోరా నాకు రోజుకు కనీసం 10 సార్లు కాల్ చేసేదని ఇటీవల విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. నోరా ఫతేహి ఈడీ ముందు తప్పుడు వాంగ్మూలాన్ని ఇచ్చిందని ఆరోపించారు. ఆమె దుర్మార్గపు ఆలోచనలతో తమను మోసం చేసిందని పేర్కొన్నాడు. అయితే జాక్వెలిన్ ఇచ్చిన వాంగ్మూలంపై తాను మాట్లాడదలచుకోలేదని అన్నారు. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించిన వివరాలతో దిల్లీ పోలీసులు అనుబంధ ఛార్జిషీట్‌లో దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

జాక్వెలిన్‌ గురించి సుకేశ్ ప్రస్తావిస్తూ.. 'ఆమె నేను గౌరవించే వ్యక్తి. ఆమె ఎల్లప్పుడూ నా జీవితంలో భాగం. ఆమెతో నాతో ఉంటే సంతోషం. ఈ కేసు ఆమెను ఎలా ప్రభావితం చేసిందో నాకు తెలుసు. జాక్వెలిన్‌ను చూసుకోవడం నా బాధ్యత. ఆమెకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు.' అని అన్నారు. కాగా.. బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ మధ్యంతర బెయిల్‌ మంజూరైన సంగతి తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు