Sukumar: మణిరత్నం గారంటే అభిమానం, కానీ కలిసేందుకు వెళ్లిన నాతో సీరియస్‌గా..

8 Jan, 2022 11:13 IST|Sakshi

Sukumar Remember A Incident With Director Mani Ratnam In a Interview: స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం వల్ల తనకు చేదు అనుభవం ఎదురైందంటూ క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన తాజాగా రూపొందించిన పాన్‌ ఇండియా చిత్రం పుష్ప బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ ఘనవిజయంతో ఫుల్‌ జోషల్‌లో ఉన్నాడు సుకుమార్‌. ఈ నేపథ్యంలో పుష్ప సక్సెస్‌తో వరస ఇంటర్య్వూలతో బిజీగా ఉన్న సుక్కు ఈ క్రమంలో మణిరత్నం గురించి ఆసక్తికర విషయం చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన కొత్తలో తన అభిమాన దర్శకుడు మణిరత్నం తీరుతో చాలా బాధపడ్డానంటూ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. 

చదవండి: బాహుబలి ‘కట్టప్ప’కు కరోనా, ఆకస్మాత్తుగా ఆస్పత్రిలో చేరిక

‘నేను మణిరత్నంగారి అభిమానిని.. ఆయన తీసిన 'గీతాంజలి' సినిమాతో మరింత ఫ్యాన్‌ అయ్యాను. ఆ సినిమా చూసిన అనంతరం థియేటర్‌ నుంచి బయటికు వెస్తుంటే.. ఒక గర్ల్ ఫ్రెండ్‌ను వదిలేసి వస్తున్నట్టుగా అనిపించింది. అలాంటి ఆయనను కలవడం ఇంతవరకూ కుదరలేదు’ అని ఆయన చెప్పుకొచ్చాడు. అలాగే మణిరత్నం ప్రభావంతోనే తాను దర్శకుడి అయ్యానన్నాడు. ‘‘ఆర్య’ సినిమా చేసిన తరువాత ఒకసారి ఆయన ముంబైలో కనిపించారు. ఆ సమయంలో మణిరత్నం గారు హీరోయిన్ శోభనతో సీరియస్‌గా ఏదో డిస్కస్ చేస్తున్నారు. చాలా సేపు వెయిట్ చేశాను. అయినా వాళ్ల సంభాషణ పూర్తి కావడం లేదు.

చదవండి: ఒకే రోజు ఓటీటీకి మూడు కొత్త సినిమాలు, ఉదయం నుంచే స్ట్రీమింగ్‌

దాంతో ఇక ఉండలేక ‘సార్’ అంటూ దగ్గరికి వెళ్లాను. అప్పుడాయన కోపంగా నా వైపు చూస్తూ ‘వెళ్లూ’ అన్నట్టుగా చేయితో సైగ చేశారు’ అని పేర్కొన్నారు. ఇక ఆ క్షణం​ ఆయనను అలా చూసి చాలా బాధపడ్డానని, తాను ఎంతగానో అభిమానించే మణిరత్నంగారు అలా అనడంతో మనసుకు చాలా కష్టంగా అనిపించిందన్నాడు. అయితే, ఒక డైరెక్టర్ సీరియస్‌గా స్రీప్ట్‌ గురించి చర్చిస్తున్న సమయంలో డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుందనేది ఆ తర్వాత తనకు అర్థమైందన్నాడు. అప్పటి ఆయన ధోరణి నాకు తప్పుగా అనిపించలేదని, అయితే ఆ క్షణం తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆయనను కలిసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని సుకుమార్‌ చెప్పాడు.

మరిన్ని వార్తలు