Pushpa 2 Movie Update: అదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్న సుక్కు.. ఆ సీన్స్‌ సినిమాకే హైలైట్‌ అట

25 May, 2022 12:14 IST|Sakshi

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప మూవీ క్రియేట్‌ చేసిన సెన్సేషన్‌ అంతా ఇంతా కాదు. పాన్‌ వరల్డ్‌ స్థాయిలో పుష్పరాజ్‌ వైరల్‌ అయ్యాడు. డైలాగ్స్‌, సాంగ్స్‌, స్టెప్పులు..ఇలా ప్రతీదీ ట్రెండ్‌ అయ్యాయి. ముఖ్యంగా ‘తగ్గేదేలే’అనే డైలాగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఒక్క డైలాగ్‌కు ప్రపంచంలోని సినీ ప్రియులంతా ఫిదా అయ్యారు.

ఈ రేంజ్ క్రేజ్ ఉన్న పుష్పకు పార్ట్ 2 అంటే  ఎలా ఉండాలి? అందుకే లేట్ గా వచ్చిన లేటేస్ట్ గా వస్తామంటున్నాడు సుకుమార్. పుష్పతో ట్రెండ్‌ చేసిన సుక్కు.. పార్ట్‌ 2కు మాత్రం పాన్‌ ఇండియా ట్రెండ్‌ని ఫాలో కావాలనుకుంటున్నాడట. గతంలో వచ్చిన బాహుబలి, రీసెంట్‌గా విడుదలైన కేజీయఫ్‌-2లో హీరో వర్సెస్‌ విలన్‌ వార్‌ని నెక్ట్స్‌  లెవల్‌లో చూపించారు. అందుకే ఈ రెండు సీక్వెల్‌ చిత్రాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి.

(చదవండి: 12 రోజులు..రూ.200 కోట్లు.. ‘సర్కారు వారి పాట’ రికార్డు)

ఇప్పుడు ఇదే ట్రెండ్ ను పుష్ప రాజ్  కూడా ఫాలో అవుతాడని చెబుతున్నాడు సుకుమార్. సెకండ్ పార్ట్ లో అల్లు అర్జున్ ,ఫాహద్ ఫాజిల్ మధ్య గేమ్ సీన్‌ సినిమాకు హైలైట్ గా నిలువనుందని క్లారిటీ ఇచ్చేశాడు. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఇంకా ఇంప్రెసివ్ గా ఉంటుందనీ, కొన్ని సీన్స్ అయితే అబ్బురపరుస్తాయని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు .

జులై నుంచి సెకండ్ పార్ట్ షూట్ ప్రారంభం కానుంది. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతుంది. మారేడుమిల్లి అడవుల్లోనే ఎక్కువ భాగం షూటింగ్ షెడ్యూల్స్ ఫిక్స్ చేసాడు సుకుమార్. జనవరితో షూటింగ్ కంప్లీట్ చేసి, మరో నాలుగు నెలలు పోస్ట్ ప్రోడకన్ కు టైమ్ ఇచ్చి, వచ్చే వేసవి లో పుష్పరాజ్ గ్రాండ్ రీఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు