కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లేలా ‘రాజమండ్రి రోజ్‌ మిల్క్‌’

29 May, 2022 14:58 IST|Sakshi

జై జాస్తి, అనంతిక జంటగా వెన్నెల కిశోర్, ప్రవీణ్, ప్రణీత పట్నాయక్‌ ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘రాజమండ్రి రోజ్‌ మిల్క్‌’. నాని బండ్రెడ్డి దర్శకత్వంలో డి. సురేష్‌బాబు, ప్రదీప్‌ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్‌   సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు.

దర్శకుడు నాని మాట్లాడుతూ –  ‘‘కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. కాలేజీ రోజుల్లో జరిగిన మరపు రాని సంఘటనలను గుర్తు చేస్తుంది’’ అన్నారు. ‘‘జూన్‌ 10న రెండవ షెడ్యూల్‌ను రాజమ్రండిలో ఆరంభిస్తాం. సెప్టెంబరులో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోవింద్‌ వసంత్, అజయ్‌ అరసాడ, యశ్వంత్‌ నాగ్, భరత్‌–సౌరభ్, కెమెరా: ముఖేష్‌ .జి, శక్తి అరవింద్‌.

మరిన్ని వార్తలు