‘కొండపొలం’ మూవీని మొదట సుకుమార్‌ తీయాలనుకున్నాడట!, కానీ..

9 Oct, 2021 20:03 IST|Sakshi

డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కొండ పొలం’. నిన్న(శుక్రవారం) విడుదలైన ఈ మూవీ మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఇందులో వైష్ణవ్ తేజ్- రకుల్ ప్రీత్‌ సింగ్‌లు హీరోహీరోయిన్లు నటించారు. కొండపొలం అనే నవల ఆధారంగా ఈ సినిమాను క్రిష్‌ అడవి నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందించిన కొండపొలం కథాకథనాలతో పాటు సంగీతం కూడా ప్రధానమైన బలంగా నిలిచింది. అయితే మొదట ఈ ‘కొండ పొలం’ చిత్రాన్ని క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తీయాలని అనుకున్నట్లు వినికిడి.

ఎందుకంటే ఖాళీ దొరికితే పుస్తకాలు చదివే సుక్కు అలా ఒకసారి కొండపొలం నవల చదివాడట. దీంతో ఈ కథ ఆధారంగా ప్రయోగాత్మక చిత్రం రూపొందించాలని అప్పుడే అనుకున్నాడని సమాచారం. అయితే అప్పటికే తాను ‘పుష్ప’ మూవీ స్క్రిప్ట్‌ను సిద్దం చేయడంతో దానిపైనే ఆసక్తి పెట్టాడట. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్న పుష్పను రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఫుల్‌ బిజీ ఆయిన సుక్కు ఇక కొండపొలంను పక్కన పెట్టినట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.

అంతేగాక ‘పుష్ప’ మూవీ కూడా ఆటవి నేపథ్యంలో ఉండటంతో రెండు సినిమాలు ఒకే నేపథ్యంలోనివి అవుతాయని భావించి కొండపొలం తీయాలనే నిర్ణయాన్ని విరమించుకున్నాడట సుకుమార్‌. ఇదిలా ఉంటే ఈ సినిమా తీయడానికి కారణం సుకుమార్‌, హరీశ్‌ శంకర్‌ అని ఓ ఇంటర్వ్యూలో క్రిష్‌ చెప్పిన సంగతి తెలిసిందే. సుకుమార్‌ ఓ సందర్భంగా కొండపొలం నవలను తన దృష్టికి తీసుకువచ్చినట్లు క్రిష్‌ తెలిపాడు. ఇది తెలిసి నెటిజన్లు క్రియోటివ్‌గా ఆలోచిస్తూ కథతో ప్రయోగాలు చేసే సుక్కు కొండపొలం తీసి ఉంటే ఎలా ఉండేదో  అని, మిస్‌ అయ్యాం అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు