కోలీవుడ్‌లో ఎంట్రీకి రెడీ అవుతున్న ర‌ష్మిక‌

26 Oct, 2020 17:47 IST|Sakshi

హీరో కార్తికి జంట‌గా ర‌ష్మిక మంద‌న్నా న‌టిస్తున్న 'సుల్తాన్' ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజైంది.  మూడేళ్ల క్రితం క‌థ విన్న‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఈ సినిమాపై అదే ఎక్స‌యిట్‌మెంట్ ఉంద‌ని హీరో కార్తీ అన్నాడు. త‌న కెరియ‌ర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ప్రొడ‌క్ష‌న్‌గా చెప్పుకొచ్చాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రెమో ఫేమ్  బక్కియరాజ్ కన్నన్ ర‌చ‌న‌తో పాటు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సిన‌మా పోస్ట్ ప్రొడక్షన్ ప‌నుల్లో ఉంది. (మరోసారి తండ్రి అయిన కార్తీ )

ఫ్యామిలీ, యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన్‌ర్‌గా తెర‌కెక్కుతున్న సుల్తాన్ సినిమాతో ర‌శ్మిక త‌మిళ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్ట‌నున్నారు. చిన్న‌ప్ప‌టి నుంచి త‌మిళ చిత్రాలు చూసి పెరిగిన నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో అవ‌కాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంద‌ని న‌టి ర‌ష్మిక అన్నారు.  సుల్తాన్ టీంతో ప‌నిచేసే అవ‌కాశం ఇచ్చినందుకు చిత్ర బృందానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కాగా 'ఛ‌లో' సినిమాతో కెరీర్ మొద‌లు పెట్టిన ర‌ష్మిక త‌క్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. కుర్ర హీరోల‌తో పాటు స్టార్ హీరోల స‌ర‌స‌న కూడా న‌టించే ఛాన్సులు కొట్టేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆమె 'పుష్ప' సినిమాలో హీరో అల్లు అర్జున్‌కు జోడీగా న‌టిస్తున్నారు. (రోజూ ఆమ్లెట్ ఉండాల్సిందే: ర‌ష్మిక‌ )

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు