సుల్తాన్‌ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. యావరేజ్‌ టాక్‌ అయినా కూడా..

3 Apr, 2021 14:24 IST|Sakshi

కార్తీ, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సుల్తాన్‌’.బక్కియరాజ్‌ కణ్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్’ బ్యాన‌ర్ ‌పై య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, య‌స్‌.ఆర్‌.ప్రభు.. లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కిన ఈ చిత్రంలో యోగిబాబు, నెపోలియ‌న్‌, లాల్, రామ‌చంద్రరాజు (‘కె.జి.యఫ్’ ఫేమ్‌) కీల‌క పాత్రలు పోషించారు. శుక్రవారం (ఏప్రిల్‌ 02)న విడుదలైన ఈ చిత్రానికి టాలీవుడ్‌లో యావరేజ్‌ టాకే వచ్చింది. అయినప్పటికీ.. మంచి ఓపెనింగ్స్‌ని రాబట్టింది. 
 
మొదటి రోజే ఈ చిత్రం రూ. 1.20 కోట్ల షేర్ ను రాబట్టి టాలీవుడ్‌లో కార్తీకి మంచి ఫాలోయింగ్‌ ఉందని నిరూపించింది. నైజాంలో  0.42 కోట్లు, ఉత్తరాంధ్రలో 0.14 కోట్లు, ఈస్ట్‌, వేస్ట్‌లో 0.10, 0.08 కోట్లు, కృష్ణ 0.12 కోట్లు, నెల్లూరులో రూ. 0.06కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. సుల్తాన్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 6.5కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రం 1.20 కోట్ల షేర్ ను రాబట్టింది. మరో 5.30 కోట్ల షేర్ ను రాబడితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయినట్టే అని చెప్పాలి.అయితే ఈ లక్ష్యాన్ని కార్తి ఛేదిస్తాడా అనేది ఈ వారాంతంలో వెల్లడయ్యే అవకాశం ఉంది. 
చదవండి:
‘సుల్తాన్‌’ మూవీ రివ్యూ
జాతిరత్నాలు డైరెక్టర్‌కు కాస్ట్‌లీ లంబోర్గిని కారు!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు