’సుల్తాన్‌కు పైరసీ షాక్‌! రేయ్‌ నా ట్విట్టర్లోనే పోస్ట్‌ చేస్తారా?

5 Apr, 2021 09:07 IST|Sakshi

చెన్నై: ‘నా ట్విట్టర్లోనే పోస్ట్‌ చేస్తారా.. ఇదిగో వస్తున్నారా..’? అంటూ సుల్తాన్‌ చిత్ర నిర్మాత ఎస్‌ఆర్‌ ప్రభు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలను పైరసీ బెడద నుంచి కాపాడడం అసాధ్యంగానే మారింది. కొత్త సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ఆ చిత్రం చట్టవిరుద్ధంగా వెబ్‌సైట్‌లో ప్రసారమవుతుంది. దీన్ని అరికట్టాలని చూసిన ఎవరి ప్రయత్నం కూడా ఫలించడం లేదు. ఇక అసలు విషయానికొస్తే నటుడు కార్తీ కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించిన చిత్రం సుల్తాన్‌. భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత శుక్రవారం తెరపైకి వచ్చింది. చిత్రానికి సక్సెస్‌ టాక్‌ రావడంతో ఖుషీలో ఉన్న చిత్ర యూనిట్‌ ఓ పక్క జిల్లాల్లోని ప్రధాన థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు.

ఇలాంటి నేపథ్యంలో సుల్తాన్‌ నిర్మాతలకు పైరసీ షాక్‌ తగులుతోంది. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే చిత్ర నిర్మాత ఎస్‌ఆర్‌ ప్రభు ట్విట్టర్‌లోనే ఒక వ్యక్తి సుల్తాన్‌ చిత్రం తన టెలిగ్రామ్‌ చానల్‌లో పొందుపరచడం జరిగిందని పోస్ట్‌ చేశాడు. దీంతో షాక్‌కు గురైన నిర్మాత ఎస్‌ ఆర్‌.ప్రభు అనంతరం రేయ్‌ ట్విట్టర్లోకే వచ్చి నా చిత్ర పైరసీకి ప్రమోట్‌ చేసే స్థాయికి వచ్చారా? ఇదిగో వస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ సంఘటన ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 

చదవండి: సుల్తాన్‌ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. యావరేజ్‌ టాక్‌ అయినా కూడా..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు