Jayamma Movie: 'జయమ్మ' లిరికల్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేసిన రాజమౌళి

16 Jan, 2022 16:48 IST|Sakshi

Suma Kanakala Jayamma Song Lyrical Video Released By SS Rajamouli: బుల్లితెర యాంకర్‌గా ఎనలేని పేరు ప్రఖ్యాతి గడించింది సుమ కనకాల. స్మాల్ స్క్రీన్‌పై వ్యాఖ్యతగా రాణిస్తూనే తాజాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సుమ కనకాల ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'జయమ్మ పంచాయితీ'. ఈ సినిమాకు విజయ్‌ కలివారపు దర్శకత్వం వహించగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరణవాణి మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఈ సినిమాలోని తొలి సాంగ్‌ అయిన తిప్పగలనా.. చూపులు నీ నుంచే పాటను నేచురల్‌ స్టార్‌ నాని విడుదల చేశాడు. రామాంజనేయులు రాసిన ఆ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్‌ను విడుదల చేశారు. 

'జయమ్మ పంచాయితీ' చిత్రంలోని జయమ్మ లిరికల్‌ సాంగ్‌ వీడియోను దర్శక ధీరుడు రాజమౌళి సోషల్‌ మీడియా వేదికగా రిలీజ్‌ చేశారు. 'కాసింత భోళాతనం.. కూసింత జాలిగుణం' అంటూ సాగే ఈ సాంగ్‌లో జయమ్మ పాత్ర జీవనశైలి, స్వభావం ఎలా ఉంటుందో చూపించారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా శ్రీకృష్ణ ఆలపించారు. అక్కడక్కడా పాట మధ్యలో సుమ కనకాల కూడా తన గాత్రం అందించింది. వెన్నెల క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నెం.2గా తెరకెక్కుతున్న ఈ సినిమాను బలాగ్‌ ప్రకాశ్‌ నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకులముందుకు వచ్చి సందడి చేయనుంది 'జయమ్మ పంచాయితీ'. 

ఇదీ చదవండి: సుమ ఎందరికో స్ఫూర్తినిచ్చే మహిళ

మరిన్ని వార్తలు