కుమారుడి పెళ్లి పార్టీలో డ్యాన్స్‌తో అదరగొట్టిన సుమలత

11 Jun, 2023 14:47 IST|Sakshi

ఫిల్మ్‌ ఇండస్ట్రీ సీనియర్‌ నటి, కర్ణాటక ఎంపీ సుమలత కుమారుడు అభిషేక్‌ వివాహం బెంగళూరులో ఘనంగా జరిగింది. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రసాద్‌ బిదపా కుమార్తె అవివాను అభిషేక్ వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా సుమలత  ఓ గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి రాజకీయ పార్టీ నేతలతో పాటు ఫిల్మ్‌ ఇండస్ట్రీ నటీనటులంతా హాజరై సందడి చేశారు. మ్యారేజ్‌ పా​ర్టీలో కొత్త జంటతో కలిసి స్టార్‌ హీరోలు యశ్‌, దర్శన్‌తో పాటు సుమలత డ్యాన్స్‌ ఇరగదీశారు.

(ఇదీ చదవండి: కూతురి అన్నప్రాసన ఫోటో.. అభిమానులతో షేర్‌ చేసుకున్న హీరోయిన్‌)

ఇప్పుడు ఇదే వీడియో షోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. విజయ్‌ ప్రకాశ్‌ హిట్‌ సాంగ్‌ అయిన 'జలీల' సాంగ్‌కు వేసిన స్టెప్స్‌ తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇదే పార్టీలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ సీఎం యడియూరప్ప, చిరంజీవి దంపతులు, ఖుష్బూ, జాకీష్రాఫ్‌  పాల్గొని కొత్త జంటను ఆశ్వీరదించారు. 

(ఇదీ చదవండి: హీరోయిన్‌ మెటిరియల్‌ కాదన్న నెటిజన్‌.. అదే రేంజ్‌లో రిప్లై ఇచ్చిన అనుపమ)

మరిన్ని వార్తలు