ఆదిత్యుడిని దర్శించుకున్న సుమన్

22 Apr, 2021 08:21 IST|Sakshi
సుమన్‌కు ఆదిత్యుని చిత్రపటాన్ని అందజేస్తున్న ప్రధాన అర్చకుడు శంకరశర్మ

సాక్షి, అరసవల్లి: ప్రముఖ సినీ నటుడు సుమన్‌ తల్వార్‌ బుధవారం అరసవల్లి సూర్యనారాయణస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయ స్వాగతం పలికి అంతరాలయంలో దర్శనం చేయించారు. అనంతరం అనివేటి మండపంలో తీర్థప్రసాదాలను ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ అందించారు. ఈ సందర్భంగా సుమన్‌ మాట్లాడుతూ విశాఖలో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సందర్భంగా అరసవల్లి వచ్చానన్నారు. అన్నమయ్యలో వేంకటేశ్వరుడు, శ్రీరామదాసులో శ్రీరాముడు వంటి దేవుళ్ల పాత్రల్లో నటించడంతో తనకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని వివరించారు. 

శ్రీకూర్మనాథుని సన్నిధిలో.. 
గార: ప్రముఖ విష్ణుక్షేత్రం శ్రీకూర్మం కూర్మనాథున్ని సినీ నటుడు సుమన్‌ బుధవారం దర్శించుకున్నారు. మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం లక్ష్మీదేవిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకు లు చామర్తి సీతారామ నృసింహాచార్యులు క్షేత్ర మహత్యాన్ని వివరించారు. ఆలయ ఈవో ఎస్‌.విజయకుమార్‌స్వామి ప్రసాదాన్ని అందజేశారు.

చదవండి: తలైవి చిత్రం ఓటీటీలో విడుదలవుతుందా?

మరిన్ని వార్తలు