మహేశ్‌ సినిమాలో ఈ ఇద్దరూ?

15 May, 2021 06:07 IST|Sakshi

‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. దాదాపు 11 ఏళ్ళ తర్వాత వీరి కాంబినేషన్‌లో రానున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని హీరోయిన్‌ పాత్ర కోసం పూజా హెగ్డే, జాన్వీ కపూర్‌ల పేర్లను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు హీరో సుమంత్‌ని తీసుకోవాలనుకుంటున్నారట. అలాగే ఓ కీలక పాత్రకు బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టిని సంప్రదించారనే ప్రచారం సాగుతోంది.

అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ గత చిత్రం ‘అల.. వైకుంఠపురములో...’లో సుశాంత్‌ ఓ కీ రోల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్కినేని కుటుంబం నుంచి మరో హీరో సుమంత్‌ని త్రివిక్రమ్‌ తీసుకోవాలనుకుంటున్న విషయం నిజమేనా? అనేది చూడాలి. అలాగే శిల్పా శెట్టి నటించనున్నది నిజమే అయితే 20 ఏళ్ల తర్వాత ఈ బ్యూటీ తెలుగు తెరపై కనిపిస్తున్నట్లు అవుతుంది. 2001లో బాలకృష్ణ నటించిన ‘భలేవాడివి బాసూ’ చిత్రం తర్వాత శిల్పా శెట్టి మరో తెలుగు సినిమా చేయలేదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు