7 డేస్‌ 6 నైట్స్‌: గోవాలో 100 మంది.. 4 కెమెరాలు..

17 Aug, 2021 12:50 IST|Sakshi

‘డర్టీ హరి’ తర్వాత ఎం.ఎస్‌. రాజు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘7 డేస్‌ 6 నైట్స్‌’. సుమంత్‌ అశ్విన్, మెహెర్‌ చాహల్, రోహన్, క్రితికి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ఎం. సుమంత్‌ అశ్విన్, ఎస్‌. రజనీకాంత్‌ నిర్మిస్తున్నారు. గోవా షెడ్యూల్‌ ముగించుకున్న చిత్రబృందం హైదరాబాద్‌ వచ్చేసింది. ఈ సందర్భంగా ఎం.ఎస్‌. రాజు మాట్లాడుతూ.. ‘విభిన్నమైన కథనం, సన్నివేశాలతో  ‘7 డేస్‌ 6 నైట్స్‌’ కథ ఆసక్తికరంగా ఉంటుంది. సుమంత్‌ తన కెరీర్‌లోనే బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు. ఈ చిత్రం ద్వారా 16 మంది కొత్తవారిని పరిచయం చేస్తున్నాం.

గోవాలో ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించాం. గోవాలో భారీ వర్షాలు కురుస్తున్నా, కరోనా నియమాలు కఠినంగా అమలవుతున్నప్పటికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ...100 మంది బృందంతో, 4 కెమెరాలతో తెరకెక్కించాం. తర్వాతి షెడ్యూల్‌ను మంగళూరు, ఉడుపిలో ప్లాన్‌ చేశాం’ అన్నారు. అలాగే సహా నిర్మాత జె శ్రీనివాసరాజు మాట్లాడుతూ.. చిత్రీకరణ చివరి దశలో ఉండగానే మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. 

మరిన్ని వార్తలు