ఇంటివాడైన యంగ్‌ హీరో సుమంత్‌.. ఫోటోలు వైరల్‌

13 Feb, 2021 19:11 IST|Sakshi

ప్రముఖ నిర్మాత ఎమ్‌ఎస్‌ రాజు కుమారుడు, టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుమంత్‌ అశ్విన్‌ ఓ ఇంటివాడయ్యాడు. హైదరాబాద్ కు చెందిన దీపికతో అతని వివాహం నగర శివార్లలోని ఫామ్ హౌస్ లో ఇరు వర్గాల కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది.  కరోనా నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధువులు మాత్రమే ఈ వివాహ వేడుకకి హాజరయ్యారు. 

'తూనీగ తూనీగ' సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సుమంత్‌. ఆతర్వాత ‘కేరింత’, ‘లవర్స్’‌, ‘ప్రేమకథా చిత్రం-2’ సినిమాల్లో నటించాడు. తాజాగా సుమంత్‌ నటించిన ‘మా కథ’ మూవీ కూడా మార్చి 19న విడుదలకు సిద్దంగా ఉంది

మరిన్ని వార్తలు