'విడాకులు..మళ్లీ పెళ్లి' జరిగితే ఎలా ఉంటుంది?

31 Jul, 2021 10:27 IST|Sakshi

సుమంత్‌ పెళ్లి కుదిరిందనే వార్త రెండు రోజుల క్రితం గుప్పుమన్న విషయం తెలిసిందే. వివాహ ఆహ్వానపత్రిక కూడా నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. అయితే సుమంత్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘మళ్ళీ మొదలైంది’ సినిమాలోని పెళ్లి ఇన్విటేషన్‌ ఇది. కాగా తన పెళ్లి గురించి వచ్చిన వార్తలకు సుమంత్‌ స్పందిస్తూ – ‘‘నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడంలేదు. ప్రస్తుతం నేను నటిస్తున్న ‘మళ్ళీ మొదలైంది’  డైవర్స్‌ మరియు రీ మ్యారేజ్‌ అంశాల నేపథ్యంలో ఉంటుంది.

తెలుగులో ఇలాంటి కథతో వస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమాలోని వెడ్డింగ్‌ కార్డ్‌ లీక్‌ అయింది’’ అని పేర్కొన్న విషయం తెలిసిందే. శుక్రవారం ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. టీజీ కీర్తి కుమార్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని కె. రాజశేఖర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. నైనా గంగూలి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు