లుక్‌ అదుర్స్‌

10 Apr, 2021 06:06 IST|Sakshi

‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’) అందించిన విజయంతో హీరో సూర్య రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీలో విడుదలైనా ఘన విజయం సాధించడంతో తర్వాతి చిత్రాన్ని మంచి జోష్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లారు సూర్య. ఈ చిత్రానికి పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తున్నారు.

సూర్య కెరీర్‌లో 40వ చిత్రమిది. కాగా ఈ చిత్రంలోని సూర్య లుక్‌ ఒకటి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. కత్తి పట్టుకొని పంచెకట్టులో నడుస్తూ వెళుతున్న సూర్య లుక్‌ అదుర్స్‌ అంటున్నారు అభిమానులు. ఆయన హెయిర్‌ స్టయిల్‌ కూడా  కాస్త మాస్‌గా అనిపిస్తోంది. తాజా ఫొటోను బట్టి చూస్తే యాక్షన్‌ సీక్వెన్స్‌లో విలన్ల భరతం పట్టబోతున్నారు సూర్య. ఆయన ఇమేజ్‌కి ఏ మాత్రం తగ్గకుండా సామాజిక అంశాలతో కూడిన మాస్‌ యాక్షన్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తీర్చిదిద్దుతున్నారట పాండిరాజ్‌. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు