ఒక సామాన్యుడి ఘర్షణ

26 Sep, 2023 04:22 IST|Sakshi
సందీప్‌ కిషన్‌ , దామోదర్‌ ప్రసాద్‌

సందీప్‌ కిషన్‌ హీరోగా సోమవారం కొత్త చిత్రం ఆరంభమైంది. సందీప్‌ కిషన్‌తో త్వరలో రిలీజ్‌కు రెడీ కానున్న ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రం రూ΄÷ందించిన ఏకే ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ ఈ చిత్రాన్ని కూడా నిర్మించనుంది. ‘మాయవన్‌’ చిత్రం తర్వాత సందీప్‌ కిషన్, దర్శకుడు సీవీ కుమార్‌ కాంబినేషన్‌లో ‘మాయవన్‌’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రూ΄÷ందనుంది. సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా అడ్వెంచర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.

తొలి సీన్‌కి వెంకట్‌ బోయనపల్లి కెమెరా స్విచాన్‌ చేయగా, దామోదర్‌ ప్రసాద్‌ క్లాప్‌ ఇచ్చారు. పి. కిరణ్‌ దర్శకత్వం వహించారు. ‘‘ఒక సూపర్‌ విలన్‌తో ఓ సామాన్యుడి ఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. రెగ్యులర్‌ షూటింగ్‌ని నవంబర్‌లో ఆరంభిస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌ నారాయణన్, కెమెరా: కార్తీక్‌ కె. తిల్లై, ఎగ్జిక్యూటివ్‌ ్ర΄÷డ్యూసర్‌: కిషోర్‌ గరికి΄ాటి (జీకే).

మరిన్ని వార్తలు