వెనక్కి తగ్గిన ‘గల్లీ రౌడీ’ కారణం అదేనట

25 Aug, 2021 11:11 IST|Sakshi

‘పోటీ వద్దు.. స్నేహమే ముద్దు’ అన్నట్లుగా ‘గల్లీ రౌడీ’ నిర్మాతలు ఇండస్ట్రీలో స్నేహపూరిత వాతావరణం ఉండాలని తమ చిత్రం విడుదలను వాయిదా వేసుకున్నారు. సందీప్‌ కిషన్, నేహా శెట్టి జంటగా రూపొందిన చిత్రం ‘గల్లీ రౌడీ’. రచయిత కోన వెంకట్‌ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్‌ ప్లే కూడా అందించారు. జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 3న విడుదల కావాల్సింది.
(చదవండి: బుల్లెట్‌ బండి పాట: ఎవరీ మోహన భోగరాజు?)

అయితే ఇప్పుడు వాయిదా వేశారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒకేరోజు సినిమాలు పోటీపడకుండా వేరే రిలీజ్‌ డేట్‌ కోసం ఆగితే మంచిదనుకున్నాం. అందుకే మా సినిమాను సెప్టెంబర్‌ 3న విడుదల చేయట్లేదు. అయితే సెప్టెంబర్‌లోనే రిలీజ్‌ చేస్తాం. త్వరలోనే కొత్త డేట్‌ ప్రకటిస్తాం’’ అన్నారు.  

మరిన్ని వార్తలు