Sundeep Kishan: నాపై వచ్చిన విమర్శలకు సమాధానం ఇదే: సందీప్‌ కిషన్‌  

1 Feb, 2023 08:53 IST|Sakshi

‘‘నేను, నాని మా కెరీర్‌ ప్రారంభం నుంచి ఫ్రెండ్స్‌. కానీ, నా సినిమా వేడుకల్లో నాని పాల్గొన్న తొలి ఈవెంట్‌ ఇదే. ఒక సినిమా కోసం ఎంత చేయగలనో ‘మైఖేల్‌’ కోసం  అంత చేశా. నాపై వచ్చిన విమర్శలకు ఈ సినిమానే సమాధానం’’ అన్నారు సందీప్‌ కిషన్‌. రంజిత్‌ జయకొడి దర్శకత్వంలో సందీప్‌ కిషన్, దివ్యాంశ కౌశిక్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘మైఖేల్‌’. నారాయణ్‌ దాస్‌ కె.నారంగ్‌ సమర్పణలో భరత్‌ చౌదరి, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలకానుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో నాని మాట్లాడుతూ.. ‘‘సినిమా ఇండస్ట్రీలో కష్టం, అదృష్టం, ప్రతిభ ఉంటే చాలా పైస్థాయికి చేరుకుంటారు.. సందీప్‌లో నాకు కష్టం, ప్రతిభ కనిపించింది.. కానీ అదృష్టం కనిపించలేదు.. అది ‘మైఖేల్‌’తో తనకి మొదలవుతుంది. ‘మైఖేల్‌’ టీజర్, ట్రైలర్‌ చూసినప్పుడు ఈ మూవీతో ఓ కొత్త ఒరవడి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ‘శివ’ సినిమా వచ్చినప్పుడు కొత్తగా ఉందనిపించింది.. అలాంటి ఓ సినిమా ‘మైఖేల్‌’ కావాలని కోరుకుంటున్నాను. సునీల్, రామ్మోహన్, భరత్‌గార్లకు ఈ సినిమా ఒక మైలురాయిగా నిలవాలి’’ అన్నారు. 

చదవండి: చేతులారా ప్రాణాలు తీసుకున్నాడు.. అసలు మాట వినలేదు: వేణు మాధవ్‌ తల్లి ఆవేదన

‘‘మైఖేల్‌’ని ఇండియాలో 1500 థియేటర్లలో రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు. ‘‘యూనివర్శల్‌ సబ్జెక్ట్‌ ఇది..  నిర్మాతలుగా మేము సంతోషంగా ఉన్నాం’’ అన్నారు భరత్‌ చౌదరి. ‘‘నాది చెన్నై.. నేను హైదరాబాద్‌ వచ్చి సినిమా తీస్తున్నాను అనే అనుభూతి నాకు కలగకుండా నాదీ హైదరాబాదే అనేలా చూసుకున్న  ఈ చిత్ర నిర్మాతలకు  థ్యాంక్స్‌’’ అన్నారు రంజిత్‌ జయకొడి.  

మరిన్ని వార్తలు