ఈ సినిమా చేయడం నా అదృష్టం

5 Mar, 2021 06:24 IST|Sakshi
వివేక్‌ కూచిభొట్ల, డెన్నిస్‌ జీవన్, సందీప్‌ కిషన్, అభిషేక్‌

సందీప్‌ కిషన్‌, లావణ్యా త్రిపాఠీ జంటగా డెన్నిస్‌ జీవన్‌  కనుకొలను దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద ్, అభిషేక్‌ అగర్వాల్, సందీప్‌కిషన్‌ , దయా పన్నెం నిర్మించిన ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ నేడు రిలీజవుతోంది. సందీప్‌ మాట్లాడుతూ– ‘‘ఈ  సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దేశభక్తితో కూడిన స్పోర్ట్స్‌ సినిమాలను ఇండియన్స్‌ అందరూ చూస్తారు. అలాంటి ఓ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ఇది. వరంగల్‌లో ఉండే రాకేష్‌ అనే వ్యక్తి కొంతమందికి హాకీ ట్రైనింగ్‌ ఇస్తున్నాడు. కానీ సరైన సౌకర్యాలు లేవు. వారికి కొంత ఆర్థిక సహాయం అందించడంతో పాటు సినిమా లాభాల్లో కొంత పిల్లల చదువు కోసం వినియోగిస్తాం’’ అన్నారు. ‘‘కథపై నమ్మకంతో మంచి ప్రయత్నం చేశాం’’ అన్నారు వివేక్‌ కూచిభొట్ల.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు