సందీప్‌ కిషన్‌ మూవీ  ‘గల్లీరౌడీ’ విడుదల తేదీ ఖరారు

6 Sep, 2021 08:55 IST|Sakshi

సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గల్లీరౌడీ’ విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 17న సినిమాని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. జి. నాగేశ్వర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయిన్‌గా నటించగా, రాజేంద్ర ప్రసాద్‌ కీలక పాత్రధారి. ప్రముఖ రచయిత కోన వెంకట్‌ సమర్పణలో కోన ఫిల్మ్‌ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యానారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

కోన వెంకట్‌ స్క్రిన్‌ ప్లే కూడా అందించిన ఈ  సినిమాకు జీవీ సహ నిర్మాత. ‘‘ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తానొక పెద్ద రౌడీనని బిల్డప్‌ ఇచ్చుకున్న ఓ యువకుడి ప్రేమకథ చివరకు ఏమైంది? అన్నదే ఈ చిత్రం కథాంశం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు