Athiya Shetty and KL Rahul: కుమార్తె పెళ్లిపై సునీల్ శెట్టి క్లారిటీ.. ఏమన్నారో తెలుసా?

20 Nov, 2022 18:47 IST|Sakshi

ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్‌ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి, టీంఇండియా ఓపెనర్ కేఎల్‌ రాహుల్ కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. గతంలో పలుసార్లు వీరిద్దరూ కలిసి జంటగా కనిపించి సందడి చేశారు. మూడేళ్లుగా సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్న జంట ఈ ఏడాదే వారి రిలేషన్‌ను ఆఫిషియల్‌గా సోషల్ మీడియాలో ప్రకటించారు. తాజాగా వీరి రిలేషన్‌పై అతియా శెట్టి తండ్రి, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి స్పందించారు. 

(చదవండి: క్రికెటర్‌ కెఎల్‌ రాహుల్‌తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన అతియా శెట్టి)

 ధారావి బ్యాంక్ మూవీ ఈవెంట్‌లో పాల్గొన్న సునీల్‌ శెట్టిని కేఎల్‌ రాహుల్‌తో మీ కుమార్తె వివాహం ఎప్పడని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ.. 'త్వరలోనే జరుగుతుంది(జల్దీ హోగీ). మరో మూడు నెలల్లో పెళ్లికి ఆహ్వానిస్తారనుకుంటున్నా' అని సమాధానమిచ్చారు.  అయితే కేఎల్ రాహుల్, అతియా శెట్టి వివాహాన్ని ఐదు-నక్షత్రాల హోటల్‌లో కాకుండా.. ఖండాలాలోని సునీల్ శెట్టి నివాసం 'జహాన్'లో పెళ్లి వేడుక ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా..2015లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన భామ 2019 'మోతీచూర్ చక్నాచూర్‌' చిత్రంలో చివరిగా కనిపించింది.     

మరిన్ని వార్తలు