Aryan khan: ఆర్యన్‌ ఖాన్‌ చిన్నపిల్లాడు.. రిపోర్టులు రానివ్వండి: సునీల్‌ శెట్టి

4 Oct, 2021 11:53 IST|Sakshi

షారుక్‌ ఖాన్‌ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌పై డ్రగ్స్‌ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు ఈ విషయంలో ఆర్యన్‌కి మద్దతుగా నిలిచారు. దీనిపై నటుడు సునీల్‌ శెట్టి సైతం స్పందించారు.

‘ఎక్కడ రైడ్‌ జరిగిన పలువురు వ్యక్తులు పట్టుబడ్డారని వింటుంటాం. అందులో ఉన్న పిల్లలు డ్రగ్స్‌ తీసుకున్నట్లు, తప్పు చేసినట్లుగా మనం ముందే నిర్థారణకి వచ్చేస్తాం. ఆర్యన్‌ విషయంలోనూ అదే జరుగుతోంది. కానీ విచారణ కొనసాగుతోంది కాబట్టి అతని ఊపిరి పిల్చుకునే అవకాశం ఇవ్వండి’ అని నటుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

‘బాలీవుడ్‌ లాంటి చిత్ర పరిశ్రమలో ఏం జరిగిన నిశితంగా పరిశీలిస్తూ, ముందే నిర్థారణకి వచ్చేస్తున్నారు. అలా కాకుండా నిజమైన రిపోర్టులు బయటకు వచ్చే వరకూ ఆగాలని’ సునీల్‌ కోరాడు. కాగా ఆర్యన్‌పై డ్రగ్స్‌కి సంబంధించిన వివిధ సెక్షన్ల కింద ఎన్‌సీబీ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

చదవండి: ఆర్యన్‌ ఖాన్‌తో లీకైన ఫోటో.. క్లారీటీ ఇచ్చిన ఎన్‌సీబీ

మరిన్ని వార్తలు