Sunila Shetty: ‘అందుకే మేం ఈ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం..’

26 Aug, 2022 16:09 IST|Sakshi

ప్రస్తుతం బాలీవుడ్‌ బాయ్‌కాట్‌ ట్రెండ్‌ ప్రధాన సమస్యగా మారింది. బాలీవుడ్‌ చిత్రాలకు ఆదరణ తగ్గిపోతున్న తరుణంగా ఈ బాయ్‌కాట్‌ సెగ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ బాయ్‌కాట్‌ ట్రెండ్‌ వల్ల స్టార్‌ హీరో అయిన ఆమిర్‌ ఖాన్‌ లాల్‌ సింగ్‌ చడ్డా వసూళ్లు పరంగా వెనకపడిపోయింది. ఆయనకు సపోర్ట్‌ చేసిన అక్షయ్‌ కుమార్‌ రక్షాబంధన్‌, హృతిక్‌ రోషన్‌ అప్‌కమ్మింగ్‌ మూవీ విక్రమ్‌ వేదాలకు కూడా దీని సెగ తాకింది. ఈ క్రమంలో తాజాగా బాయ్‌కాట్‌ ట్రెండ్‌ సీనియర్‌ నటుడు సునీల్‌ శెట్టి స్పందించారు. 

చదవండి: బాలీవుడ్‌ స్టార్లను అమ్ముకుంటుంది: అనుపమ్ ఖేర్‌ సంచలన వ్యాఖ్యలు

ఇటీవల రాయ్‌పూర్‌ వచ్చిన ఆయను మీడియా బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ సినిమా కథల పట్ల ప్రజలు సంతోషంగా లేరని అనిపిస్తోందన్నారు. ‘మేము ఎన్నో మంచి సినిమాలు చేశాం. కానీ నేటి రోజుల్లో మేం చూపిస్తున్న కథల పట్ల ప్రజలు సంతోషంగా లేనట్టున్నారు. అందుకే మేము(బాలీవుడ్‌) ఇలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ప్రజలు థియేటర్లకు రావడం లేదు. ఎందుకు ఇలా జరుతుందనే దానిని గురించి నేను కచ్చితంగా చెప్పలేను. దీనికి కారణాలేంటో వేలెత్తి చూపలేను’ అని చెప్పుకొచ్చారు.

చదవండి: కేబీసీలో ఆసక్తికర సంఘటన, షర్ట్‌ విప్పి రచ్చ రచ్చ చేసిన కంటెస్టెంట్

అలాగే ‘ఒకప్పుడు ప్రజలకు వినోదం అంటే టీవీ, థియేటర్లే. కానీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైం వంటి ప్లాట్‌ఫాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచి మంచి షోలు, మూవీలను చూసే అవకాశం ఏర్పడింది. 4జీ టెక్నాలజీ రావడం, డేటా చార్జీలు దిగి రావడం, ఓటీటీల ట్రెండ్ నడుస్తుండడం, కరోనా తర్వాత ఏర్పడిన పరిస్థితుల వల్ల ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యారు. ఇది దేశవ్యాప్తంగా సినిమా పరిశ్రమపై పెద్ద ప్రభావాన్నే చూపిస్తోంది’ అని సునీల్‌ శెట్టి వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు