అతియా ఇంగ్లండ్‌లో ఉంది, వారిది చక్కని జంట: సునీల్‌ శెట్టి

16 Jul, 2021 13:17 IST|Sakshi

KL Rahul Athiya Shetty: టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌, బాలీవుడ్‌ నటి అతియా శెట్టి ప్రేమలో ఉన్నారని గత కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. పబ్‌లు, పార్టీలకు కలిసి వెళ్తూ వీరు కథనాలకు మరింత బలం చేకూరుస్తున్నారు. ఇక, కేఎల్‌ రాహుల్‌ ప్రస్తుతం టెస్టు సిరీస్‌ నిమిత్తం ఇంగ్లండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, అతియా, ఆమె సోదరుడు అహాన్‌ కూడా రాహుల్‌తో పాటు అక్కడే ఉన్నట్లు వారి సోషల్‌ మీడియా అప్‌డేట్స్‌ ద్వారా తెలుస్తోంది. కాగా, తమ భార్యలు లేదా భాగస్వాములను వెంట తీసుకెళ్లేందుకు బీసీసీఐ క్రికెటర్లకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. రాహుల్‌ అతియాను తన పార్ట్‌నర్‌గా పేర్కొంటూ పర్మిషన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఈ క్రమంలో వీరి బంధానికి పెద్దల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లేనని, ఈ జంట ప్రేమ కహానీ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుందంటూ గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతియా శెట్టి తండ్రి, బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సునీల్‌ శెట్టి తన కూతురు ఇంగ్లండ్‌లో ఉందని కన్‌ఫాం చేసేశాడు. ఓ ప్రముఖ వెబ్‌సైట్‌తో మట్లాడుతూ... ‘‘అవును.. అతియా ఇంగ్లండ్‌లోనే ఉంది. అయితే.. తను అహాన్‌(అతియా సోదరుడు)తో ఉంది. వాళ్లిద్దరూ అక్కడ సెలవులను ఎంజాయ్‌ చేస్తున్నారు. మిగతా విషయాలు మీకు తెలిసే ఉంటాయి’’ అని పేర్కొన్నాడు.

ఈ సందర్భంగా రాహుల్‌- అతియా జంట గురించి సునీల్‌ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్రముఖ ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌ వీరిని అంబాసిడర్లుగా నియమించుకుంది. నిజానికి వాళ్లిద్దరూ చూడక్కని జంట కదా. కాదంటారా? అందుకే యాడ్‌ అంతబాగా వచ్చింది. ఇక రిలేషన్‌ గురించి అంటారా వారినే డైరెక్ట్‌గా అడిగితే సరి’’ అంటూ నవ్వులు చిందించాడు. దీంతో.. రాహుల్‌- అతియా పెళ్లికి సునీల్‌ సుముఖంగానే ఉన్నట్లు కనిపిస్తోందంటూ ఫ్యాన్స్‌ గుసగుసలాడుకుంటున్నారు. కాగా 'నుమి ప్యారిస్' అనే లగ్జరీ గాగుల్స్ యాడ్‌లో వీరిద్దరూ కలిసి నటించిన సంగతి తెలిసిందే.

A post shared by NUMI Paris (@numiparis)

మరిన్ని వార్తలు