సునీల్-హెబ్బా పటేల్‌ల ‘గీత’ వచ్చేస్తుంది

14 Aug, 2022 15:12 IST|Sakshi

హెబ్బా పటేల్, సునీల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘గీత’. ‘మ్యూట్ విట్నెస్’ అన్నది ఉప శీర్షిక.  ‘గ్రాండ్ మూవీస్‌’పతాకంపై ఆర్.రాచయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.వి వినాయక్‌ శిష్యుడు విశ్వా.ఆర్.రావు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’చిత్రాల ఫేమ్ సాయి కిరణ్ ప్రతి నాయకుడిగా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 26న విడుదల కానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు విశ్వ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా అవకాశం నా గురువు, దైవం అయిన వినాయక్ గారే ఇప్పించారు. నిర్మాత రాచయ్యగారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను" అన్నారు. నిర్మాత ఆర్.రాచయ్య మాట్లాడుతూ... "గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా మా డైరెక్టర్ విశ్వ... ‘గీత’చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఈనెల 26న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’ అన్నారు.

రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి , తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో సూపర్ గ్లామర్ హీరోయిన్ హెబ్బా పటేల్ అనాథల కోసం పోరాడే మూగ యువతిగా... ఓ చాలెంజింగ్ రోల్ చేస్తుండడం విశేషం.  సూర్య, లలిత, ప్రియ, మీనాకుమారి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు ఇతర పాత్రలు ప్లే చేస్తున్న ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నాడు.

మరిన్ని వార్తలు