మహేశ్‌ సినిమాలో సునీల్‌.. త్రివిక్రమ్‌ మూడో ప్రయత్నం ఫలించేనా?

14 May, 2021 10:19 IST|Sakshi

సునీల్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఎంత మంది స్నేహితులలో అందరికి తెలిసిందే. కెరీర్‌ ఆరంభంలో ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు. ఇద్దరు కూడా ఒకే రూంలో ఉండి సినిమా ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు త్రివిక్రమ్‌. సునీల్‌ కమెడియన్‌గా స్టార్‌డమ్‌ ఉన్న సమయంలోనే హీరోగా అవకాశాలు రావడంతో కామెడీ పాత్రలు మానేశాడు. ఇటీవల ఆయనకు హీరోగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో తన స్నేహితుడిని మరోసారి హిట్‌ట్రాక్‌ ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నాడు త్రివిక్రమ్‌.      

హీరో నుండీ మళ్ళీ కమెడియన్ గా మారాలి అని సునీల్ డిసైడ్ అయినప్పుడు.. త్రివిక్రమ్ తన ‘అరవింద సమేత’ లో ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఆ సినిమాలో సునీల్‌ పాత్ర పండలేదు. ఇక ‘అల వైకుంఠపురములో’ సినిమాలో కూడా సునీల్ కు త్రివిక్రమ్ ఛాన్స్ ఇచ్చాడు కానీ ఆ సినిమాలో అతను ఉన్నట్టు కూడా జనాలు గుర్తు పెట్టుకోలేదు.

దీంతో త్రివిక్రమ్‌ ముచ్చటగా మూడోసారి సునీల్‌కి అవకాశం ఇస్తున్నాడు. సూపర్‌ స్టార్‌ మహేశ్‌తో త్రివిక్రమ్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ మధ్యనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మరో హీరోకి కూడా అవకాశం ఉందట. ఆ పాత్రకు సునీల్‌ని ఎంపిక చేసుకున్నాడట త్రివిక్రమ్‌. గత చిత్రాల మాదిరి కాకుండా ఇందులో సునీల్‌ పాత్రని చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్‌ చేశాడట. మరి మహేశ్‌  సినిమాతో అయినా సునీల్‌ హిట్‌ ట్రాక్‌ ఎక్కుతాడో చూడాలి. 
చదవండి :
మహేశ్‌ బాబు SSMB28 సినిమాలో శిల్పాశెట్టి ?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు