ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెప్పిన సింగర్‌ సునీత, కారణం ఇదే..

28 Mar, 2021 10:23 IST|Sakshi

టాలీవుడ్‌లో సింగర్‌ సునీతకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సింగ‌ర్‌గా, టెలివిజన్‌ యాంకర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. తన మధుర గాత్రంతో వందల పాటలు పాడి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్‌లో ఏ సింగర్‌కి లేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఆమె సొంతం. ఇక ఇటీవల రామ్‌ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న సునీత ఇటు కెరీర్‌ను, అటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్‌ చేస్తూ వస్తుంది. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ గాయని.. తాజాగా అభిమానులకు క్షమాపణ చెప్పింది.

దానికి కారణం తన మ్యూజికల్ ఈవెంట్ క్యాన్సిల్ కావడం. అసలు విషయంలోకి వెళ్లే... ప్రముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌ణిశ‌ర్మ ఆధ్వ‌ర్యంలో శనివారం నాడు హైదరాబాద్‌లోని పీపుల్ ప్లాజాలో‘మణిశర్మ మ్యూజికల్ నైట్’ ఈవెంట్ జరగాల్సి ఉంది. అందులో సునీతతో పాటు గీతామాధురి, రమ్య, అనురాగ్‌ కులకర్ణి, సాహితి, రేవంత్ శ్రీక్రిష్ణ, సాకేత్ తదితర గాయకులు పాల్గొనాల్సి ఉంది. అయితే హైదరాబాద్‌లో కరోనా కేసులో ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఈ కార్యక్రమం రద్దయింది. ఈ విషయాన్ని సింగర్‌ సునీత సోషల్‌ మీడియాలో తెలియజేస్తూ.. ఫ్యాన్స్‌కి క్షమాపణ చెప్పింది. ‘క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఇవాళ జ‌ర‌గాల్సిన మ‌ణిశ‌ర్మ మెగా మ్యూజిక‌ల్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. అంద‌రి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే దీన్ని క్యాన్సిల్ చేశారు. స్టే సేఫ్’ అంటూ శనివారం తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది సునీత.

మరిన్ని వార్తలు