సన్నీ డియోల్‌కు కరోనా

3 Dec, 2020 06:15 IST|Sakshi

బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. ‘‘కరోనా టెస్ట్‌ చేయించుకుంటే పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటున్నాను. ఈ మధ్య కాలంలో నన్ను కలిసినవాళ్లందరూ టెస్ట్‌ చేయించుకోండి. ఐసోలేషన్‌లో ఉండండి’’ అన్నారు సన్నీ. సినిమాల విషయానికి వస్తే.. ‘అప్నే 2’లో నటించనున్నారాయన. తండ్రి ధర్మేంద్ర, సోదరుడు బాబీ డియోల్, అలానే కుమారుడు కరణ్‌ డియోల్‌తో కలసి ఈ సినిమాలో నటించనున్నారు సన్నీ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా