సన్నీలియోన్‌ భర్తకు షాకిచ్చిన డ్రైవర్‌

25 Feb, 2021 19:20 IST|Sakshi

శృంగార తారగా పేరొందిన నటి సన్నీ లియోన్‌ భర్త డేనియల్‌ వెబెర్‌కు ముంబైలోని ఓ వ్యక్తి షాకిచ్చాడు. వెబెర్‌కు సంబంధించిన కారు నంబర్‌ తన కారుకు పెట్టుకుని ముంబైలో యథేచ్ఛగా తిరిగాడు. దీంతో ముంబై ట్రాఫిక్‌ పోలీసులు భారీగా చలాన్లు వేశారు. అయితే డేనియల్‌కు సంబంధించిన కారు నంబర్‌ గుర్తించిన డ్రైవర్‌ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిని బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రముఖుల కార్ల నంబర్లను తన కారుకు పెట్టుకుని తిరగడం అతడికి అలవాటు అని పోలీసులు తెలిపారు.

సన్నీలియోన్‌ భర్త డేనియల్‌ వెబెర్‌ కారు డ్రైవర్‌ అక్బర్‌ ఖాన్‌. అతడు ఇటీవల ముంబైలో ఒకచోట అచ్చం తన యజమాని కారు నంబర్‌ పెట్టుకున్న ఓ కారును గుర్తించాడు. దీన్ని చూసి షాక్‌కు గురయి వెంటనే ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ కారును ట్రాప్‌ చేసి పట్టుకోగా పీయూష్‌ సేన్‌ అందులో ఉన్నాడు. పీయూశ్‌ సేన్‌ డేనియల్‌ కారు నంబర్‌ను తన మెర్సిడెస్‌ బెంజ్‌ కారుకు పెట్టుకున్నాడు. ఆ కారులో విచ్చలవిడిగా నిబంధనలు ఉల్లంఘిస్తూ తిరగడంతో ట్రాఫిక్‌ పోలీసులు చలాన్లు వేశారు. అయితే ఆ చలాన్లు అన్నీ కూడా సన్నీలియోన్‌ భర్త డేనియల్‌ వెబెర్‌కు వెళ్లాయి. సెప్టెంబర్‌ 2020లో చలాన్లు వెళ్లగా షాక్‌కు గురయిన డేనియల్‌ ఏం జరుగుతుందో అతడికి తెలియలేదు.

తాజాగా ముంబైలో ఆ కారును నంబర్‌ను పీయూష్‌ సేన్‌ వినియోగించడంతో ఆ చలాన్లు వచ్చాయని గుర్తించాడు. అయితే పీయూష్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి అతడి కారు పత్రాలు పరిశీలించగా తప్పుడు వివరాలు వచ్చాయి. సన్నీలియోన్‌ భర్త డేనియల్‌ కూడా స్టేషన్‌కు వచ్చి పత్రాలు సమర్పించాడు. డేనియల్‌ వివరాలు సక్రమంగా ఉన్నాయి. దీంతో ఇతరుల నంబర్‌ వినియోగిస్తూ పీయూష్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తున్నాడని పోలీసులు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే గతంలో కూడా ప్రముఖుల కార్ల నంబర్లను పీయూష్‌ వినియోగిస్తున్నాడని తెలిసింది. ఈ సందర్భంగా పీయూష్‌పై వాహనదారుల చట్టం 139, ఐపీసీ సెక్షన్‌ 420, 465, 468 కింద కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్‌ డీసీపీ యశస్వీ యాదవ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు