రోడ్డు మీద మహిళ ఇబ్బందులు: సన్నీలియోన్‌ భర్త సాయం

29 Mar, 2021 14:58 IST|Sakshi

మనుషులు యంత్రాల్లా మారిపోయిన రోజులివి. ఉరుకుల పరుగుల జీవితంలో పక్కనోడిని కాదు కదా కనీసం నా అన్నవాడిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. సినీ తారల పరిస్థితి మరీ ఘోరం. టంచనుగా షూటింగ్‌కు వెళ్లాల్సిదేనంటూ సూర్యుడు ఉదయించకముందే గడప దాటి మళ్లీ ఏ అర్ధరాత్రో, అపరాత్రో ఇంటికి చేరుకుంటారు. షూటింగ్స్‌ లేని రోజుల్లో అయినా ఖాళీగా ఉంటారా? అంటే అదీ కుదరదు. ఏదో ఒక వేడుకకు రమ్మని వారికి నిత్యం ఆహ్వానాలు అందుతూనే ఉంటాయి.

తాజాగా బాలీవుడ్‌ తార సన్నీలియోన్‌ తన భర్త డేనియల్‌ వెబర్‌తో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల కార్యక్రమానికి వెళ్లింది. అవార్డుల ఫంక్షన్‌ ముగిశాక శనివారం రాత్రి ఇద్దరూ కారులో ఇంటికి తిరుగుపయనమయ్యారు. దారిలో రోడ్డు మీద ఓ మహిళ తన కారు టైర్‌ మార్చేందుకు తెగ ఇబ్బందులు పడటం డేనియల్‌ కంట పడింది. ఇంకేముందీ, వెంటనే అతడు కారు ఆపేసి ఆమె దగ్గరికి వెళ్లి సాయం చేశాడు.

అతడి హెల్పింగ్‌ నేచర్‌కు ముచ్చటపడిపోయిన సన్నీ 'ట్రూ జెంటిల్‌మెన్‌' అంటూ దీన్నంతటినీ వీడియో తీసి షేర్‌ చేసింది. ఇది చూసిన అభిమానులు 'వావ్‌.. మీరెంత మంచివాళ్లు' అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 'ఇందుకే మీరు మా అందరికీ ఫేవరెట్‌ కపుల్'‌ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా సన్నీ, డేనియల్‌ 2011లో వివాహం చేసుకున్నారు. వీళ్లు నిశా అనే అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. సరోగసీ ద్వారా ఇద్దరు మగ కవలలు నోవా, అశెర్‌కు జన్మనిచ్చారు.

చదవండి: సన్నీలియోన్‌ భర్తకు షాకిచ్చిన డ్రైవర్‌

భర్త నగ్న ఫొటోను షేర్‌ చేసిన సన్నీ లియోన్‌

మరిన్ని వార్తలు