సన్నీలియోన్ ప్రధాన పాత్రలో హారర్‌ చిత్రం

20 Apr, 2021 08:19 IST|Sakshi

బాలీవుడ్‌ సంచలన నటి సన్నీ లియోన్‌ కోలీవుడ్‌లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ శృంగార  తార ఇంతకుముందు తమిళంలో కథానాయికగా నటించినా అది ఇప్పటికీ తెరపైకి రాలేదు. తాజాగా ఒక హారర్‌ కామెడీ చిత్రంలో నటించనున్నారు. దీన్ని వీఏయూ మీడియా ఎంటర్‌ టెయిన్‌మెంట్, వైట్‌ హార్స్‌ స్టూడియోస్‌ సంస్థల అధినేతలు డీవీ.శక్తి, కె.శశి కుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సిందనై చెయ్‌ చిత్రం ఫేమ్‌ యువన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హాస్యనటుడు సతీష్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు.

ఈ చిత్రం సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర వివరాలను వెల్లడించారు. తమిళంలో తాను సిందనై చెయ్‌ చిత్రం తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదేనన్నారు. ఇది చరిత్రకు సంబంధించిన హారర్‌ కామెడీ చిత్రంగా ఉంటుందని తెలిపారు. ఇందులో బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌ ప్రధాన పాత్రలో నటిస్తే బాగుంటుందని ఆమెను ఎంపిక చేసినట్లు చెప్పారు. మరో ప్రధాన పాత్రల్లో సతీష్‌ నటించనుండగా, మోటో రాజేంద్రన్, గణేష్‌ తిలక్‌ వంటి పలువురు నటించనున్నట్లు తెలిపారు. చెన్నై, పెరంబలూర్, దురైముగమ్‌ ప్రాంతాలతో పాటు ముంబైలో 20 రోజులు నిర్వహించడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. దీనికి దీపక్‌ డీ మీనన్‌ ఛాయాగ్రహణను, జావిద్‌ రియాజ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.  
చదవండి:  లేడీ ఓరియంటెడ్‌ చిత్రంలో సన్నీ లియోన్


 
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు