Sunny Leone In Ganpati Mandapam: గణేశుడి సన్నిథిలో సన్నీలియోన్‌.. నెటిజన్ల కామెంట్లు

22 Sep, 2023 16:32 IST|Sakshi

విదేశాల్లో పుట్టి పెరిగిన భారత సంతతికి చెందిన సన్నీలియోన్‌ నీలిచిత్రాల్లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వెండి తెరపై కూడా ఎంతో పేరు తెచ్చుకున్న సన్నీలియోన్‌ పలు సినిమాలతో బిజీగా ఉంటుంది. ఆమెకు ఇక్కడ భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

భారతీయులకు ప్రధానమైన హిందూ పండుగల్లో గణేశ్‌ చతుర్థి ఒకటి.  తాజాగా ఈ బ్యూటీ భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో గణేశ్‌ చతుర్థి ఉత్సవాల్లో పాల్గొంది. ముంబైలోని లాల్‌బాగ్‌ వద్ద  గణేశుడి మండపానికి భర్త డానియల్ వెబర్‌తో కలిసి వెళ్లి పూజలు చేసింది. దీంతో ఆమెను చూసేందుకు భారీగా జనాలు అక్కడికి చేరుకున్నారు.  ఆమెతో సెల్పీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఓ వైపు వర్షం పడుతున్నా ఏ మాత్రం లెక్కచేయకుండా నడుచుకుంటూ వెళ్లి బొజ్జ గణపయ్యను ఆమె దర్శించుకుంది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: వాల్తేరు వీరయ్య నటుడు బాబీకి స్నేహితుల నుంచే హత్య బెదిరింపులు!)

సన్నీలియోన్‌ ఎక్కడున్నా భారతీయ మూలాలు ఉన్న స్త్రీ కాబట్టి ఆమెలో దైవభక్తి ఉందని నెటిజన్లు తెలుపుతున్నారు.  తనకు ఊహ తెలీని టైంలో తప్పులు చేశానని సన్నీలియోన్‌ గతంలో ఇలా చెప్పింది. 'నేను చేసిన తప్పుల వల్ల ఇప్పుడు కొన్ని చోట్ల తల దించుకుంటున్నాను. ఎంతయినా భారతీయ మూలాలు నాలో ఉండడం వల్లేనేనేమో నేను ఇలా ఆలోచిస్తున్నాను కాబోలు.' అని సన్నీలియోన్‌ చెప్పింది. తాజాగా ఆమె భర్తతో పాటుగా బొజ్జ గణపయ్యను దర్శించుకోవడంతో ఆమెను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

మరిన్ని వార్తలు