Rajinikanth: అమలాపాల్‌కు తలైవా వార్నింగ్.. కాపురంలో చిచ్చు పెట్టిందనా?

24 Sep, 2023 16:59 IST|Sakshi

టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు అమలా పాల్. అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో నటించింది.  బెజవాడ చిత్రంలో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ స్టార్‌ హీరోలతోనూ నటించింది. లవ్ ఫెయిల్యూర్, నాయక్, రఘువరన్ బీటెక్ చిత్రాలతో మెప్పించింది. ఆడై చిత్రంలో అమల న్యూడ్‌గా నటించి అభిమానులకు షాకిచ్చింది.  ప్రస్తుతం కోలీవుడ్, శాండల్‌వుడ్‌ చిత్రాలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోషూట్లతో అభిమానులను అలరిస్తూ ఉంటోంది. 

(ఇది చదవండి: ఆటో డ్రైవర్‌తో గొడవపడ్డ నటి.. డబ్బులివ్వకుండా చెక్కేసింది! ఇంత ఘోరమా?)

అయితే తాజాగా ఓ మలయాళీ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వార్త కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ధనుశ్‌తో చాలా క్లోజ్‌గా ఉండేదని అంటున్నారు. వీరిద్దరు కలిసి నటించిన వేళైల్లై పట్టదారి సినిమాతో సన్నిహితంగా మెలిగినట్లు అప్పట్లో తెగ వైరలైంది. అంతే కాకుండా వీరిద్దరి రిలేషన్‌పై కోలీవుడ్‌లో తెగ చర్చ నడిచింది.

అయితే ప్రస్తుతం అమలాపాల్ గురించి ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ధనుశ్‌తో అమలాపాల్ సన్నిహితంగా మెలగడంపై సూపర్ స్టార్ రజినీకాంత్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కోలీవుడ్ ప్రముఖ జర్నలిస్టు, సినీ విమర్శకుడు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించినట్లు సమాచారం.  ధనుశ్, అమల మధ్య రిలేషన్ వల్లే రజినీకాంత్ కూతురు ఐశ్వర్యతో గొడవలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారని సమాచారం. రజినీకాంత్ తన కూతురు జీవితం కోసమే అమలా పాల్ ఇంటికి వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చినట్లు కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్టు ప్రస్తావించారు.

అయితే ఈ వార్తల్లోన నిజమెంత ఉందో ఇంకా తెలియాల్సి ఉంది. కొందరేమో ఇదంతా రూమర్స్ అని కొట్టి పారేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం జర్నలిస్ట్ చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.  

(ఇది చదవండి: హీరోయిన్‌గా ప్రముఖ డైరెక్టర్‌ కూతురు.. కీలక పాత్రలో టాలీవుడ్ నటుడు!! )

మరిన్ని వార్తలు