Krishna Daughter Manjula: మిమ్మల్ని చాలా మిస్సయ్యా..లవ్‌ యూ నాన్న.. మంజుల ఎమోషనల్ ట్వీట్

15 Nov, 2022 21:40 IST|Sakshi

సూపర్‌ స్టార్ కృష్ణ మరణం పట్ల ఆయన కూతురు మహేశ్‌ సోదరి మంజుల ఘట్టమనేని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాన్నను తలుచుకుని ఎమోషనల్ అయ్యారు మంజుల. మీరు టాలీవుడ్‌కు మాత్రమే కాదు.. ప్రపంచానికే సూపర్ స్టార్ అంటూ కొనియాడారు. మా పట్ల మీరు చూపించిన ప్రేమానురాగాలు చిరకాలం మాతోనే ఉంటాయని నాన్నతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకున్నారు. తండ్రి మరణాన్ని తలుచుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

(చదవండి: గచ్చిబౌలి స్టేడియానికి కృష్ణ పార్థివదేహం.. ఎందుకు తరలించలేదంటే?)

ట్విటర్‌లో మంజుల రాస్తూ.. ' నాన్నా. మీరు ప్రపంచానికే సూపర్ స్టార్. మా కోసం మీరు చూపించిన ప్రేమ చిరకాలం మాతోనే ఉంటుంది. ఏది ఏమైనా మీరే నా జీవితానికి సూపర్ ‍స్టార్. చిత్రసీమకు మీరు చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయి. ఇప్పటికే నిన్ను చాలా మిస్‌ అవుతున్నా. లవ్‌ యూ నాన్న.' ఎమోషనల్ పోస్ట్ చేసింది.     

మరిన్ని వార్తలు