'మా జీవితంలో వారికిచ్చే పెద్ద బహుమతి అదేనేమో'.. మంజుల ఎమోషనల్ పోస్ట్

22 Nov, 2022 15:50 IST|Sakshi

కొద్ది రోజుల సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. సూపర్‌స్టార్‌  కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఘట్టమనేని ఇందిరా దేవి కన్నుమూశారు. ఈ ఏడాదిలోనే కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్‌ బాబు కూడా మరణించారు. మహేశ్ బాబుకు ఈ ఏడాది తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. టాలీవుడ్ చిత్రసీమ మొత్తం కదలివచ్చి సూపర్‌స్టార్‌కు నివాళులర్పించింది. ఇందిరా దేవికి ర‌మేష్ బాబు, మహేష్ బాబు, ప‌ద్మావ‌తి, మంజుల, ప్రియదర్శిని ఐదుగురు సంతానం. తాజాగా ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరా దేవి పెళ్లిరోజు సందర్భంగా మంజుల ఎమోషనల్ పోస్ట్ చేసింది.

(చదవండి: నాన్న.. నువ్వు ప్రపంచానికే సూపర్ స్టార్.. మంజుల ఎమోషనల్ ట్వీట్)

మంజుల తన ఇన్‌స్టాలో రాస్తూ..' వారి వివాహబంధం స్వర్గంలో కొనసాగేంత గొప్ప బంధం. అమ్మ వెళ్లిన తర్వాత నాన్న చాలా మిస్  అయ్యారని నేను అనుకుంటున్నా. అందుకేనేమో మమ్మల్ని విడిచి అమ్మ వద్దకే చేరాడు. నిజంగా  వారు ఆత్మలు కూడా సహచరులేనేమో. వారి 60 ఏళ్ల వివాహబంధానికి మేం ఐదుగురు పిల్లలం. ఇలాంటి ఉన్నతమైన వ్యక్తులు నా తల్లిదండ్రులు కావడం నిజంగా అదృష్టం. వారి ప్రేమ మాకు ఎల్లప్పుడు అండగా ఉంటుంది. వారిలో కనీసం 10 శాతమైన స్వచ్ఛంగా మారడమే వారికిచ్చే ఉత్తమ బహుమతి అని నేను భావిస్తున్నా.' అంటూ ఎమోషనల్ అయ్యారు మంజుల. అమ్మా, నాన్నకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వారితో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు . 

A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni)

మరిన్ని వార్తలు